లింక్ చేయడమే కాదు.. అంచనాలూ ఓదెల అందుకుంటాడా?
నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
By: M Prashanth | 8 Jun 2026 8:00 AM ISTనేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దసరా తర్వాత ఆ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. అదేంటంటే ది ప్యారడైజ్ క్లైమాక్స్ లో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారనే ప్రచారం.
ప్రస్తుతం దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా.. సోషల్ మీడియాలో ఆ టాక్ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ చిరంజీవితో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ది ప్యారడైజ్ స్టోరీ చిరంజీవి సినిమాతో లింక్ చేసే ప్రయత్నం జరుగుతోందని ప్రచారం సాగుతోంది.
ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ పెరుగుతోంది. ఒక సినిమాలో రోల్స్ లేదా ఇన్సిడెంట్లను మరో సినిమాతో లింక్ చేస్తూ దర్శకులు కొత్త వరల్డ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడమే కాకుండా, తర్వాత ప్రాజెక్టులపై కూడా భారీ హైప్ తీసుకొస్తోంది. అదే ఫార్మాట్ ను శ్రీకాంత్ ఓదెల కూడా ఫాలో అవకాశం ఉందని తెలుస్తోంది.
ది ప్యారడైజ్ క్లైమాక్స్ లో చిరంజీవి పాత్రకు చిన్న పరిచయం ఇచ్చి, తర్వాత ఆయనతో చేసే సినిమాకు స్ట్రాంగ్ పిల్లర్ వేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే, టాలీవుడ్ లో మరో పెద్ద సినిమాటిక్ యూనివర్స్ కు శ్రీకారం చుట్టినట్లే అవుతుంది. ఇప్పటికే కొన్ని యూనివర్స్ లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందిన నేపథ్యంలో, శ్రీకాంత్ ఓదెల ప్రయత్నం ఎలా ఉంటుందన్న ఆసక్తి కూడా పెరుగుతోంది.
అయితే ఇక్కడ అసలు ప్రశ్న మాత్రం ఒక్కటే. ఇలాంటి లింకులు, క్యామియోలు, యూనివర్స్ కాన్సెప్టులు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచగలవు. కానీ చివరకు సినిమాను నిలబెట్టేది కంటెంట్ మాత్రమే. దసరాతో తన కథ చెప్పే శైలిని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ ఓదెల, ది ప్యారడైజ్ తో అంచనాలను అందుకుంటారా లేదా అనేది ఇప్పుడు చర్చగా మారింది.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆయా షేర్ పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేసింది. నాని రా అండ్ రస్టిక్ లుక్, పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా బ్యాక్ డ్రాప్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు మోహన్ బాబు విలన్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. హీరోయిన్ గా కయాదు లోహర్ నటిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఆగస్టు 21న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక చిరంజీవి క్యామియో, సినిమాటిక్ యూనివర్స్ విషయాలపై క్లారిటీ రావాలంటే మూవీ టీమ్ అఫీషియల్ గా రెస్పాండ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అయితే ఆ ప్రచారం నిజమైతే ప్యారడైజ్ పై అంచనాలు మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
