చిరు ఆ ఇద్దరిలో ఎవరితో స్టార్ట్ చేస్తాడు?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి `మన శంకరవరప్రసాద్ గారు` చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2026 సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
By: Tupaki Desk | 22 Dec 2025 1:00 AM ISTఈ ఏడాది ప్రారంభంలో `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని అందరిని ఆశ్యర్యపరిచిన అనిల్ రావిపూడి ఇదే ఫార్ములాని పాటిస్తూ మరో సినిమాతో 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి `మన శంకరవరప్రసాద్ గారు` చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2026 సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత చిరు మరింత స్పీడుగా రెండు భారీ ప్రాజెక్ట్‌లని సెట్స్ పైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. అందులో ఒకటి `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ కాగా మరొకటి బాబి మూవీ. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నేచురల్ స్టార్ నాని హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ `ది ప్యారడైజ్` చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
నానిని డిఫరెంట్ యాంగిల్‌లో ప్రజెంట్ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సికింద్రాబాద్ లోని ఓ రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో సాగిన హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ సినిమాపైఅంచనాల్ని పెంచేసింది.
ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రాజెక్ట్ తరువాత శ్రీకాంత్ ఓదెల ..మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతుండటంతో తను చిరుని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్‌ని హీరో నాని స్వయంగా నిర్మించబోతుండటం మరింత హైప్‌ని క్రియేట్ చేస్తోంది. నానితో కలిసి సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి సుధాకర్ చెరుకూరి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళుతుందని, శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం `ది ప్యారడైజ్` ప్రాజెక్ట్‌లో బిజీగా ఉంటూనే చిరు మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక చిరు ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెడతాడని వెల్లడించారు. అయితే ఇదే సమయంలో చిరుతో బాబి చేయాలనుకుంటున్న మూవీ కూడా పట్టాలెక్కబోతోందని తెలిసింది. అయితే ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో చిరు దేనికి ముందు ప్రాధాన్యం ఇస్తాడో.. ఏ డైరెక్ట్ మూవీని ముందు స్టార్ట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.
