మెగాస్టార్ బర్త్ డే సందడే సందడి!
చిరంజీవి కొన్ని దశాబ్దాల తర్వాత నటిస్తోన్న సోషియా ఫాంటసీ చిత్రమిది. `అంజి` తర్వా త చిరు మళ్లీ ఆజానర్ ని టచ్ చేయలేదు.
By: Tupaki Desk | 3 Aug 2025 5:47 PM ISTమెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజంటే అభిమానులకు పెద్ద పండగ లాంటింది. ఆ రోజు అన్నయ్య నుంచి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయా? అని ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తుంటారు అభిమానులు. అందుకు తగ్గట్టే మెగాస్టార్ ప్లానింగ్ కూడా ఉంటుంది. అయితే ఈసారి అభిమానులకు డబుల్-ట్రిబుల్ ట్రీట్ ఉంటుందని అంతా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం మెగాస్టార్ లైనప్ లో ఉన్న చిత్రాలే. వరుసగా నాలుగు సినిమాలు క్యూలో ఉండటంతో ఏ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వస్తుంది? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 'బింబిసార' ఫేం వశిష్ట దర్శకత్వంలో `విశ్వంభర` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
పతాక స్థాయిలో 'విశ్వంభర'
చిరంజీవి కొన్ని దశాబ్దాల తర్వాత నటిస్తోన్న సోషియా ఫాంటసీ చిత్రమిది. 'అంజి' తర్వా త చిరు మళ్లీ ఆజానర్ ని టచ్ చేయలేదు. దీంతో 'విశ్వంభర'తో మెగాస్టార్ ఎలా అలరించబోతున్నారు? అన్నది ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. దీంతో అంచనాలు పతాక స్థాయికి చేరాయి. పైగా ఈ సినిమాతో చిరు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు? అన్నది అభిమానులు సహా ఇండస్ట్రీ వర్గాల్లో వాడి వేడిగా జరుగుతోన్న చర్చ. అందుకు తగ్గట్టే వశిష్ట కూడా అంతే కాన్పిడెంట్ గా ఉన్నాడు.
బ్యాకెండ్ వర్క్ వేగంగా
అన్నయ్య ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఔట్ పుట్ పై పూర్తి నమ్మకంగా ఉన్న తర్వాతే రిలీజ్ తేదీని ప్రకటిస్తానని అంత వరకూ రిలీజ్ మాటతో అభిమా నులను అనవరంగా ఊరించనని తెగేసి చెప్పాడు. దీంతో అన్నయ్య పుట్టిన రోజు నాడు ఆ విషయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మెగా కాంపౌండ్ వర్గాల నుంచి లీకైంది. దీనికి సంబంధించి బ్యాకెండ్ వర్క్ వేగంగానే జరుగుతోందని సమాచారం. అలాగే మెగాస్టార్ 157వ చిత్రం కూడా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వేగంగానే పూర్త వుతుంది.
157 ప్రచారం పీక్స్ లో
ఇప్పటికే మూడు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తయింది. ఈ నేపథ్యంలో స్పెషల్ డే రోజున అభిమానుల కోసం అన్నయ్య న్యూ లుక్ ని వదిలే అవకాశం ఉంది. అనీల్ కూడా అందుకు అన్ని రకాలుగా సంసిద్దం చేస్తు న్నట్లు లీకులందుతున్నాయి. సినిమా లాంచింగ్ తోనే ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లిన అనీల్ అన్నయ్య బర్త్ డేకి అంతకు మించి హైప్ తెస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెలతో నూ మెగాస్టార్ కమిట్మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో భారీ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లాక్ అయింది. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ అందించలేదు.
అభిమానుల కోసం మాస్ అప్ డేడ్
దీంతో చిరు పుట్టిన రోజునాడు కొత్త అప్ డేట్ వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే చిరు మళ్లీ బాబితో చేతు లు కలుపుతోన్న సంగతి తెలిసిందే. 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో భారీ మాస్ థ్రిల్లర్ ని ప్లాన్ చేస్తోందీ ద్వయం. ఈ చిత్రం పట్టాలెక్కడానికి సమయం పడుతుంది. కానీ అంతకంటే ముందే మెగా అభిమానుల కోసం మాస్ అప్ డేడ్ తో ముందుకు రావాలని బాబి అంతే సంకల్పించాడు. ఈ నేప థ్యంలోనే ప్రాజెక్ట్ గురించి ముందుగానే హింట్ ఇచ్చారు. దీంతో అన్నయ్య బర్త్ డేకి స్వీట్ న్యూస్ ఉం టుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా నాలుగు సినిమాలతో మెగాస్టార్ ఆగస్టు 22న సందడి చేయడం దాదాపు లాంఛనంగానే కనిపిస్తోంది.
