సీనియర్లలో బాలయ్య ఒక్కడే బ్యాలెన్స్!
ఆ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తే ఆయన నోట నో అనే మాట రాదు. కానీ బాలయ్య నుంచి ఓ క్లారిటీ రావాలి.
By: Tupaki Desk | 26 Jun 2025 8:15 AM ISTసీనియర్ హీరోలంతా మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఓ స్టార్ హీరో చిత్రంలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ పోషించడానికి కూడా ఆలోచించడం లేదు. ఇండస్ట్రీ ట్రెండ్ కు తగ్గట్టు వాళ్లు మౌల్డ్ అవుతున్నారు. ఈ విషయంలో నాగార్జున, వెంకటేష్ ఎప్పటి నుంచో ముందులో ఉన్నారు. ఇటీవలే చిరంజీవి కూడా అందుకు సంసిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. తోటి స్టార్ హీరోల చిత్రాల్లో తాను సైతం కీలక పాత్రలకు సిద్దంగా ఉన్నట్లు రివీల్ చేసారు.
ఈ విషయంలో కింగ్ నాగార్జున తనని ఎంతగానో ఇన్ స్పైర్ చేసారన్నారు. అలాగే ఓటీటీ సిరీస్ లు కూడా చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో చిరంజీవి తెరపై ఎలా చూపించాలనుకున్నా? అందుకు ఆయన సిద్దంగానే ఉన్నట్లు అర్దమవుతుంది. బాలయ్య కూడా స్టార్ హీరోల చిత్రాల్లో గెస్ట్ పాత్రలు ఆఫర్ చేస్తే ఆయన నో చెప్పే అవకాశం లేదు. చిరంజీవితో కలిసి నటించడానికి తాను సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు పంపించేసారు.
ఆ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తే ఆయన నోట నో అనే మాట రాదు. కానీ బాలయ్య నుంచి ఓ క్లారిటీ రావాలి. ఇంత వరకూ ఆయన ఓటీటీ సిరీస్ ల గురించి స్పందించలేదు. వాటిలో నటించడానికి బాలయ్యకు అసక్తిగా ఉన్నారా? లేదా? అన్నది ఏ సందర్భంలోనూ రివీల్ చేయలేదు. కానీ ఆహా ఓటీటీ వేదికపై అన్ స్టాపబుల్ షోను మాత్రం హోస్ట్ చేస్తున్నారు. ఆ టాక్ షో అంత పెద్ద సక్సెస్ అయిందంటే కారణం బాలయ్య వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాంటి బాలయ్య వెబ్ సిరీస్ ల్లోకి ఎంట్రీ ఇస్తే మామూలగా ఉండదు. ఫ్యాన్స్ లో పూనకాలే. దర్శకులు ఆయనలో కొత్త కోణాన్ని కూడా ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మిగతా ముగ్గురు సీనియర్ స్టార్లకంటే కూడా బాలయ్య ఓటీటీలో ఇంకా గొప్ప సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది.
