మెగాస్టార్ బరిలోకి దిగేది ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 April 2025 4:30 PMమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. ఎండలు తీవ్రంగా ఉండటంతో సమ్మర్ తర్వాత మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి `విశ్వంభర` డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో? అవన్ని పూర్తయిన తర్వాత పట్టాలెక్కుతుందని వినిపించింది.
కానీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలవుతుందట. అదే నెల మూడవ వారం నుంచి చిరం జీవి సెట్స్ కు హాజరవుతారని సమాచారం. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోనే చేస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇందులో చిరుకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు ఎంపికయ్యారు. ఓ సీనియర్ హీరోయిన్తో పాటు యువ భామను పెయిర్ గా తీసుకున్నారుట.
ఇదే సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ విషయాలన్ని అధికారికంగా కన్పమ్ అవ్వాల్సి ఉంది. మొత్తానికి షూటింగ్ విషయంలో చిరంజీవి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తీవ్రమైన ఎండలు సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగుతున్నారు. మే అంటే భానుడి భగభగలు పీక్స్ లో ఉంటాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఆ సమయంలో ఆన్ సెట్స్ లో ఉన్న షూటింగ్ లకు సైతం బ్రేక్ ఇస్తుంటారు.
ముఖానికి మ్యాకప్ లతో ఉండటం కష్టమైన పని. కానీ చిరు సరిగ్గా అదే సయంలో బరిలోకి దిగుతున్నారు. దీంతో చిరు ఎంత కమిట్ మెంట్ తో ఉంటారు? అన్నది మరోసారి అర్దమవుతుంది. ఇచ్చిన డేట్ల ప్రకారం షూటింగ్ కి హాజరు కావాల్సిందే అన్న నిబద్ధతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో `విశ్వంభర` డబ్బింగ్ సహా ప్రచారం పనుల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది.