Begin typing your search above and press return to search.

మెగా 157 : రఫ్ఫాడించే సెల్ఫీ

ఇటీవలే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయింది. ప్రారంభం అయినప్పటి నుంచి సినిమాను ఏకధాటిగా షూటింగ్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   28 May 2025 12:52 PM IST
మెగా 157 : రఫ్ఫాడించే సెల్ఫీ
X

ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో సినిమాను రూపొందిస్తున్నారు. 2026కి కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్లే సినిమాను గ్యాప్‌ లేకుండా షూట్‌ చేస్తున్నారు. ఇటీవలే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయింది. ప్రారంభం అయినప్పటి నుంచి సినిమాను ఏకధాటిగా షూటింగ్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈమధ్య కాలంలో అనిల్ రావిపూడి సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.


మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా 2026 సంక్రాంతికి కచ్చితంగా రానున్న నేపథ్యంలో అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవితో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నాడు. చిరంజీవి ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత మెగా ఎంటర్‌టైనర్‌ను ఆస్వాదించేందుకు రెడీ కావాలంటూ అనిల్ రావిపూడి ఇప్పటికే అనధికారికంగా పిలుపునిచ్చారు. వింటేజ్‌ చిరంజీవిని చూపించడంతో పాటు, ఫ్యాన్స్ చిరంజీవి నుంచి ఏం ఆశిస్తున్నారో అన్ని ఈ సినిమాలో ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు, మీడియా వర్గాల వారు చెబుతున్నారు.

మెగా 157 సెట్స్ నుంచి రెగ్యులర్‌గా అనిల్ రావిపూడి ఏదో ఒక అప్డేట్‌ను ఇస్తూనే ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమాలో నయనతార జాయిన్‌ అయింది అంటూ అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో నయనతారతో ఒక వీడియోను చేయడం ద్వారా సినిమాకు మరింత హైప్‌ క్రియేట్‌ చేశారు. అంతే కాకుండా నయనతార ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందా అనే ఆసక్తిని అందరిలోనూ కల్పించడంలో మేకర్స్ సక్సెస్‌ అయ్యారు. సినిమాను ఎప్పుడూ ప్రమోట్‌ చేసే విధంగా సోషల్‌ మీడియాలో ఏదో ఒకటి షేర్‌ చేస్తూ ఉండే అనిల్‌ రావిపూడి తాజాగా ఈ మెగా సెల్ఫీని అందరి ముందుకు తీసుకు వచ్చాడు.

ఈ సెల్ఫీలో దర్శకుడు అనిల్‌ రావిపూడితో పాటు నిర్మాత సుస్మిత కొణిదెల తో పాటు మరో నిర్మాత సాహు గారపాటి ఉన్నారు. షూటింగ్‌ నడుస్తోంది అంటూ మేకర్స్ ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ద్వారా మరోసారి సినిమాను వార్తల్లో నిలిపినట్లు అయింది. అనిల్ రావిపూడి సినిమాను ఎంత క్రియేటివ్‌గా రూపొందిస్తారో, అంతకు మించి క్రియేటివ్‌గా, వినోదాత్మకంగా సినిమాను ప్రమోట్‌ చేస్తారు. అందుకే ఈ సెల్ఫీని చాలా మంది మెగా ఫ్యాన్స్ రఫ్ఫాడించేశావ్‌ అనిల్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ పదే పదే అనిల్ రావిపూడి చెబుతున్న నేపథ్యంలో సినిమా టైటిల్‌గా అదే రఫ్ఫాడించేద్దాం అంటూ ఖరారు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. అతి త్వరలోనే టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, చిరంజీవి లుక్‌ను రివీల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.