చిరు-అనిల్ మూవీ... ఆ రెండు ఫుల్‌గా ఉంటాయట!
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే చేసిన విశ్వంభర సినిమా కంటే ప్రస్తుతం చేస్తున్న అనిల్ రావిపూడి సినిమాపైనే అంచనాలు భారీగా ఉన్నాయి.
By: Tupaki Desk | 12 Jun 2025 12:06 PM ISTమెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే చేసిన విశ్వంభర సినిమా కంటే ప్రస్తుతం చేస్తున్న అనిల్ రావిపూడి సినిమాపైనే అంచనాలు భారీగా ఉన్నాయి. విశ్వంభర సినిమాను ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందు నుండే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషన్ షురూ చేశాడు. సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత అంచనాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే.
అనిల్ రావిపూడి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం విజయంలో కీలక పాత్ర పోషించింది ఏంటి అంటే అంతా ఠక్కున చెప్పే విషయం కామెడీ. ఆ సినిమా మాత్రమే కాకుండా అనిల్ రావిపూడి గతంలో వచ్చిన సినిమాల్లోనూ ఎక్కువ శాతం కామెడీ ఉంటుంది. ఒక్క భగవంత్ కేసరి మినహా మిగిలిన సినిమాల్లో ఎక్కువ శాతం కామెడీ ఉంటుంది. ఇక చిరంజీవి సినిమాలోనూ మాస్ మసాలా కామెడీ ఉంటుందని సమాచారం అందుతోంది. అంతే కాకుండా చిరంజీవి వింటేజ్ యాక్టింగ్, వింటేజ్ కామెడీ సీన్స్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబో మూవీని కేవలం కామెడీకి పరిమితం చేయకుండా ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చూపించబోతున్నారు.
సాధారణంగా ఎమోషన్స్ ఎక్కువ అయితే కామెడీ ఉన్నా భారంగా అనిపిస్తుంది. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను బ్యాలన్స్ చేస్తూ స్క్రీన్‌ప్లే రాసుకున్నట్లు తెలుస్తోంది. ఎమోషన్స్‌తో కాస్త స్క్రీన్ ప్లే భారంగా సాగుతుంది అనుకున్న సమయంలో కామెడీ సీన్స్ వస్తాయట. అలా కామెడీతో పాటు ఫ్యామిలీ భావోద్వేగాలను అద్భుతంగా ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి పండించబోతున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు. అందుకే ఫ్యామిలీ ఎమోషన్స్‌కి కూడా పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
2026 సంక్రాంతికి విడుదల కాబోతున్న చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్న నేపథ్యంలో తమిళ్‌లోనూ ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అనిల్ రావిపూడి సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే విడుదల అవుతూ ఉంటాయి. మరి ఈసారి ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ సినిమాలోని పాటలు సైతం అదే స్థాయిలో ఉండే విధంగా భీమ్స్ కసితో వర్క్ చేస్తున్నాడని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాను సాహు గారపాటితో కలిసి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అతి త్వరలోనే సినిమా నుంచి కీలక అప్డేట్ రాబోతుందని సమాచారం అందుతోంది. అది ఏంటి, ఎప్పుడు చూడాలి.
