చిరు కోసం స్పెషల్ కిస్సిక్ నంబర్?
ఇటీవల బన్నీ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'పుష్ప 2'లో కిస్సిక్ అంటూ మెస్మరైజ్ చేసిన శ్రీలీల మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 8 Jun 2025 5:54 AMమెగాస్టార్ చిరంజీవి మైథలాజికల్ మూవీ 'విశ్వంభర' తరువాత ఓ భారీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. ఈ సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని వార్తల్లో నిలిచిన అనిల్ రావిపూడి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అనిల్ మార్కు కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో చిరకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది.
షైన్ క్రియేషన్స్‌తో కలిసి చిరు డాటర్ సుష్మిత ఓ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ అనౌన్స్‌మెంట్ దగ్గరి నుంచే వార్తల్లో నిలుస్తూ అటెన్షన్ క్రియేట్ చేస్తూ వస్తోంది. ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌ని చిరుతో మొదలు పెట్టిన అనిల్ అదే పంథాలో నయనతార ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తోందంటూ ప్రకటించి తనదైన మార్కు పబ్లిసిటీతో రఫ్ఫాడించేశాడు. ఇదిలా ఉంటే ఈ క్రేజీ మూవీకి సంబంధించిన తాజాగా మరో క్రేజీ స్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇటీవల బన్నీ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'పుష్ప 2'లో కిస్సిక్ అంటూ మెస్మరైజ్ చేసిన శ్రీలీల మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యంగ్ డాన్సింగ్ సెన్సేషన్‌గా పేరుతెచ్చుకున్న శ్రీలీల, చిరుతో కలిసి స్టెప్పులు వేయడానికి రెడీ అవుతోందనే మాటే ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. చిరు డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అలాంటి డ్యాన్సింగ్ మాస్టర్ చిరుతో శ్రీలీల కలిసి స్పెషల్ సాంగ్‌కు స్టెప్పులేయడం అంటే అది ఫ్యాన్స్‌కి, మూవీ లవర్స్‌కి ఐ ఫీస్ట్‌గా నిలవడం గ్యారంటీ అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఫోక్ సాంగ్‌లను ఇరగదీస్తున్న సంగీత దర్శకుడు భీమ్స్ ఈ మూవీ కోసం ఓ భారీ మాసీవ్ సాంగ్‌ని ప్లాన్ చేశాడట. ఆ బీట్‌కి చిరు ఐకానిక్ డ్యాన్స్, శ్రీలీల గ్రేస్ ఫుల్ మూవ్స్ తోడైతే సిల్వర్ స్క్రిన్‌పై మరో సెన్సేషన్ క్రియేట్ అయినట్టే.
త్వరలో ఈ స్పెషల్ కిస్సిక్ సాంగ్‌కు సంబంధించిన అప్ డేట్ అఫీషియల్‌గా రానుందని తెలిసింది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ని మొదలు పెట్టిన అనిల్ రావిపూడి రాకెట్ స్పీడుతో షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు. చిరు మార్కు కామెడీ పంచ్‌లతో పాటు అనిల్ మార్కు కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.