Begin typing your search above and press return to search.

మెగా అల్లరి మొదలైంది!

మెగాస్టార్ చిరంజీవి తన లైన్ నుంచి జంప్ చేస్తూ ఇప్పుడు వైవిధ్యమైన కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 May 2025 12:38 PM
Chiranjeevi And Anil Ravipudi Movie Shooting Starts
X

మెగాస్టార్ చిరంజీవి తన లైన్ నుంచి జంప్ చేస్తూ ఇప్పుడు వైవిధ్యమైన కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక చిరంజీవిని అల్లరిగా, కామెడీ టైమింగ్‌లో చూసి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరు ఒకవైపు మాస్ ఇమేజ్ చూపిస్తూనే మరోవైపు కామెడీ తో మెప్పించారు. ఇక ఇప్పుడు పూర్తిగా ఆ టైమింగ్ ను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో డైరెక్టర్ అనిల్ రవిపూడి మేగా157 సినిమాను సిద్ధం చేస్తున్నారు.

ఈ కాంబినేషన్ కొత్తగా ఉండడమే కాకుండా, అనిల్ మార్క్ ఫన్, ఫ్యామిలీ, ఫుల్ మాస్ ఎంటర్‌టైన్మెంట్ మిక్స్ గా ఉండబోతున్నాయి. ఈ సినిమా ప్రారంభం నుంచే ప్రతి అప్‌డేట్ స్పెషల్ గానే వచ్చింది. మొదటి అనౌన్స్‌మెంట్ వీడియో వినూత్నంగా ఉండగా, కథానాయిక నయనతార ఇంట్రడక్షన్ వీడియోను సైతం వినూత్నంగా హైలెట్ చేశారు.

ఇక చిరంజీవి - నయనతార మధ్య వచ్చే స్క్రీన్ కామెడీ, ఎమోషనల్ సీన్స్‌ పై ఇప్పటికే చర్చ మొదలైంది. చిరు గత కొన్ని సినిమాల్లో మాస్ ఎలివేషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టగా, ఈసారి పూర్తి విభిన్నమైన ట్రాక్‌ను అనిల్ ఎంచుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో చిత్రీకరణ మొదలైంది.

ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు సమాచారం. చిరంజీవి ఈ సినిమాకి పూర్తి డెడికేషన్‌తో టైం కేటాయించారని, ఒకే షెడ్యూల్‌లో అధికభాగం చిత్రీకరణ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.

మైత్రీ మూవీస్ బ్యానర్ అనుభవంతో, కొణిదెల ఫ్యామిలీ ఎమోషన్ తో సినిమా విజన్ బలంగా ముందుకు సాగుతుంది. 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ షూటింగ్ షెడ్యూల్ ను స్పీడ్ మీద నడిపిస్తున్నారు. మెగా157 చిరు ఫిల్మోగ్రఫీలో వినోదాత్మక, మాస్ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.

ఇందులో ఆయన పాత్రకు ప్రత్యేక గెటప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. డిఫరెంట్ ట్రాక్ తో కూడిన ఈ కథ మాస్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను సమానంగా ఆకట్టుకునేలా రూపొందుతోందని టాక్. ఇక సంక్రాంతికి సరిగ్గా హాలీడే సీజన్‌ని టార్గెట్ చేస్తూ, మేగా157 థియేటర్లలో సందడి చేయనుందని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్స్ తో అనిల్ రావిపూడి అల్లరి ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.