Begin typing your search above and press return to search.

మెగా 157.. రిలీజ్ క్రిస్ మస్ అనుకున్నారా ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మెగా 157 ప్రాజెక్ట్ బుల్లెట్ ట్రైన్ ఎలా దూసుకెళ్తుందో అలా షూటింగ్ జరుపుకుంటుంది.

By:  Tupaki Desk   |   24 July 2025 5:00 PM IST
మెగా 157.. రిలీజ్ క్రిస్ మస్ అనుకున్నారా ఏంటి..?
X

మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మెగా 157 ప్రాజెక్ట్ బుల్లెట్ ట్రైన్ ఎలా దూసుకెళ్తుందో అలా షూటింగ్ జరుపుకుంటుంది. అనిల్ రావిపూడి తన సినిమాలన్నీ కూడా ఇలానే సూపర్ ఫాస్ట్ గా తీసుకెళ్తాడు. ఐతే ఫాస్ట్ చేస్తున్నాడు కదా అని తాను అనుకున్న కథ, స్క్రీన్ ప్లే మ్యాజిక్ మిస్ అవుతుందా అంటే అలాంటిది ఏమి ఉండదు. మోనిటర్ ముందే సినిమాలో ఈ సీన్ ఇక్కడ కట్ అని పర్ఫెక్ట్ కాలిక్యులేషన్ తో అనిల్ షూటింగ్ చేస్తుంటాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సరిగ్గా సినిమా ఎంత అవసరమో అంత ఒక్క సీన్ కూడా ఎక్స్ ట్రా తీయలేదట.

అంతేకాదు సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 75 రోజుల్లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంటాడట అనిల్. చిరంజీవి సినిమా అయితే అంత తక్కువ రోజుల్లో కష్టమని అనుకున్నా కాదు ఇది అనిల్ రావిపూడి సినిమా కచ్చితంగా అనుకున్న విధంగా అనుకున్న రోజుల్లో షూట్ అవుతుంది అంతే అని అంటున్నారు. మెగాస్టార్ తో అనిల్ చేస్తున్న సినిమా కూడా షూటింగ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో జరుగుతుంది.

ఈమధ్యనే కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు చిత్ర యూనిట్. సినిమాను అనిల్ 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నాడు. వీళ్ల దూకుడు చూస్తుంటే ఈ ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ చేసినా చేయొచ్చనేలా ఉన్నారు. చిరంజీవి, నయనతారల లాంటి స్టార్ కాస్ట్ ఉన్నా కూడా తను అనుకున్న షెడ్యూల్ ని అనుకున్న దాని కన్నా ముందే పూర్తి చేస్తున్నాడట అనిల్. పేపర్ వర్క్ అంతా కూడా ముందే ప్రీ ప్రొడక్షన్ లో పూర్తి చేసి ఆన్ లొకేషన్ కావాల్సిన షాట్స్ షూట్ చేయడమే లేట్ అన్నట్టుగా అనిల్ పనితనం ఉందట.

అందుకే అనిల్ వర్కింగ్ స్టైల్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిదా అయ్యారని తెలుస్తుంది. 150కి పైగా సినిమాల అనుభవం ఉన్న చిరంజీవి అనిల్ పనిచేస్తున్న తీరు.. అతను షెడ్యూల్ ప్లానింగ్.. అతని పర్ఫెక్షన్ ఇలా ప్రతి విషయంలో అటు కాస్టింగ్ కు, ప్రొడ్యూసర్ కి మేలు జరిగేలా అనిల్ రావిపూడి పనిచేస్తున్నాడు. అతను అలా చేస్తున్నాడు కాబట్టే 8 సినిమాలు తీస్తే 8 సక్సెస్ అందుకున్నాడు. మెగా మూవీ దూకుడు చూస్తుంటే ఈసారి రాబోయే సంక్రాంతికి కూడా అనిల్ 9వ హిట్ పక్కా అనిపించేలా ఉన్నాడు.