బుల్లిరాజుతో మెగాస్టార్ కామెడీ పీక్స్ లో!
మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 July 2025 1:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది పక్కా కామెడీ ఎంటర్ టైనర్. అనీల్ మార్క్ చిత్రం. చిరంజీవి ఇలాంటి జానర్ సినిమా చేసి చాలా కాలమ వుతుంది. ఆయన కెరీర్ ఆరంభంలో ...మధ్యస్థంలో మరికొన్ని కామెడీ జానర్లో నటించారు. కాల క్రమంలో కామెడీ తగ్గించారు. కమర్శియల్ చిత్రాల్లో ఆ కామెడీ అన్నది రెండు ...మూడు సన్నివేశాలకే పరిమితం చేసారు. దీంతో చాలా కాలానికి చిరు పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయడం ఇదే.
స్టోరీ విన్నప్పుడే ఎంతో నవ్వుకుని ఎంజాయ్ చేసారు. ఇక ఆన్ సెట్స్ లో ఏ రేంజ్ లో ఆ కామెడీని ఆస్వాది స్తున్నారో? చెప్పాల్సిన పనిలేదు. ఇందులో రేవంత్ అలియాస్ బుల్లిరాజు కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనీల్ బుల్లిరాజును ప్రత్యేకించి కామెడీ కోసమే తీసుకున్నాడు. `సంక్రాంతి వస్తున్నాం` సక్సెస్ లో బుల్లి రాజు బూతు కామెడీ వర్కౌట్ అవ్వడంతోనే ఆ సినిమా 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. అలాం టింది చిరంజీవితో బుల్లిరాజు కలిస్తే ఇంకే రేంజ్ లో హంగామా ఉంటుందో ? చెప్పాల్సిన పనిలేదు.
చిరంజీవి గొప్ప కామెడీ టైమింగ్ ఉన్న నటుడు. సహ నటులు కూడా అదే పాత్రలో కనిపిస్తే చిరంజీవి గొప్ప కామెడీ పండిం చగలడు. ఇప్పుడు బుల్లి రాజు తోడైన నేపథ్యంలో ఇద్దరి మధ్య కామెడీ పీక్స్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇద్దరి కాంబినేషన్ సన్నివేశాలు చాలానే ఉన్నాయట. సినిమాకు ఇవే హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార రోల్ కూడా ఆద్యంతం కామెడీగానే ఉంటుందిట. అనీల్ హీరోయిన్లను కేవలం గ్లామర్ కే పరిమితం చేయడు.
హీరోయిన్లతో మంచి సన్నివేశాల తీయగల దర్శకుడు. కథతో పాటు హీరోయిన్ పాత్రలు ట్రావెల్ అవు తుంటాయి అనీల్ సినిమాలో. నయనతారలోనూ కామెడీ టింజ్ ఉంది. అదుర్స్ లో నయన్ కామెడీ ఎంతగా వర్కౌట్ అయిందో తెలిసిందే. అదే తరహాలో 157 లోనూ అంచనా వేస్తున్నారు. ఇదంతా వర్కౌట్ అయితే గనుక 157వ సినిమా సునాయాసంగా 500 కోట్ల క్లబ్ లో చేరుతుంది. మెగాస్టార్ ఇమేజ్ కి వీళ్లందరి కామెడీ తోడైతే ఆ ఫిగర్ పెద్ద కష్టమేమి కాదు.
