Begin typing your search above and press return to search.

చిరంజీవి కోసం మ‌రో భాగ్యం దిగుతుందా!

క్యాస్టింగ్ ఎంపిక‌లో అనీల్ రావిపూడి ప‌ర్పెక్ట్. అత‌డి ఎంపిక‌లు పక్కాగా పాత్ర‌ల‌కు స‌రిపోతుంటాయి.

By:  Tupaki Desk   |   6 May 2025 6:53 AM
చిరంజీవి కోసం మ‌రో భాగ్యం దిగుతుందా!
X

క్యాస్టింగ్ ఎంపిక‌లో అనీల్ రావిపూడి ప‌ర్పెక్ట్. అత‌డి ఎంపిక‌లు పక్కాగా పాత్ర‌ల‌కు స‌రిపోతుంటాయి. భాగ్యం పాత్ర‌కు ఐశ్వ‌ర్యా రాజేష్ ని ఎంపిక చేయ‌డం సినిమాకు ఎంత‌గా క‌లిసొచ్చిందో తెలిసిందే. ఆపాత్ర‌కు తాను త‌ప్ప ఇంకెవ్వ‌రు న్యాయం చేయ‌లేరు అన్నంత‌గా న‌మ్మి తీసుకున్నాడు. అనుకున్న‌ట్లే స‌క్సెస్ అయ్యాడు. నిజానికి తెలుగు అమ్మాయి అయిన ఐశ్వ‌ర్యా రాజేష్ కి స‌రైన అవ‌కాశాలు రాక చాలా కాలంగా ఇబ్బంది ప‌డుతుంది.

స‌రైన పాత్ర ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తుంది. అలాంటి స‌మ‌యంలో అనీల్ రూపంలో ద‌క్కిన గొప్ప అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఫేమ‌స్ అయింది. ఆ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అనీల్ గత సినిమాల్లోక వెళ్లినా? హీరోయిన్ పాత్ర అంటే ఇలా వ‌చ్చి అలా వెళ్ల‌డం త‌ర‌హాలో ఉండ‌దు. వాళ్ల పాత్ర‌కు ఓ వెయిట్ ఉంటుంది. న‌ట‌న‌కు చాలా స్కోప్ ఇస్తాడు. న‌టులంద‌ర్నీ క‌థ‌లో చ‌క్క‌గా భాగం చేస్తాడు.

ఇది అనీల్ కు మాత్రమే చెల్లింది. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి క‌థానాయకుడిగా ఓ సినిమా తెర కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులోనూ ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ని తొలి నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. తొలి నాయిక‌గా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ను తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారంలో జ‌రు గుతోంది. దాదాపు ఆమె ఎంపిక ఖ‌రారైందంటున్నారు. అలాగే సెకెండ్ లీడ్ కోసం వెత‌గ్గా వెత‌గ్గా? ఓ క్రేజీ బ్యూటీ తార‌స‌ ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది.

ఆమె క్యాథ‌రీన్ ట్రెసా. అనీల్ రాసిన సెకెండ్ లీడ్ కు క్యాథ‌రీన్ ప‌ర్పెక్ట్ గా సెట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఆమె తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఇది ప‌క్కా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని ముందే రివీల్ చేసాడు. చిరు పాత్ర ఆద్యంతం కామిక్ గా ఉంటుంది. ఇలాంటి కామెడీలు న‌య‌న‌తారకు కొత్తేం కాదు. క్యాథరీన్ కూడా అందుకు అన్ని ర‌కాలుగా అర్హురాలే.