Begin typing your search above and press return to search.

నాన్న‌మ్మ‌కు నాన్న‌...అమ్మ‌కు నేను వంట చేస్తాం!

ఇప్ప‌టికీ అదే భ‌యం క‌లుగుతుంద‌ని చాలా సంద‌ర్బాల్లో చెప్పాడు. చిన్నప్ప‌టి నుంచి చ‌ర‌ణ్ అమ్మ పార్టీనే. ఏం కావాల‌న్నా వాళ్ల అమ్మ‌నే అడిగే వారుట‌.

By:  Tupaki Desk   |   11 May 2025 8:17 AM
నాన్న‌మ్మ‌కు నాన్న‌...అమ్మ‌కు నేను వంట చేస్తాం!
X

మెగాస్టార్ చిరంజీవి అప్పుడ‌ప్పుడు కిచెన్ లో చెఫ్ గా మారిపోతుంటారు. త‌న‌కు ఇష్ట‌మైన వాళ్ల‌ను ఇంటికి పిలిచి వండించి వ‌డ్డించ‌డం ఓ అల‌వాటు. ఆ మ‌ధ్య ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో త‌న స్నేహితుడు కింగ్ నాగార్జున‌ను పిలిపించి మంచి చేప‌ల పులుసు పెట్టించారు. ప్రెష్ గా చేప‌లొచ్చాయి? రా పార్టీ చేసుకుం దామ‌ని పిల‌వ‌డంతో నాగ్ వెళ్లారు. మంచి ట్రీట్ ఆస్వాదించారు. ఇలాంటి రేర్ మూవ్ మెంట్స్ చిరు-నాగ్ మ‌ధ్య ఉంటాయి.

అలాగే చిరంజీవి గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. చిరింజీవి అమితంగా ఇష్ట‌ప‌డి వంట చేసింది వాళ్ల అమ్మ కోసం అట‌. చిరంజీవి తానే స్వ‌యంగా వండి అమ్మ‌కు వ‌డ్డిస్తారుట‌. ఈ విష‌యాన్ని రామ్ చ‌ర‌ణ్ తెలిపాడు. చిరంజీవి అలా చేసిన స‌మ‌యంలో చ‌ర‌ణ్ వాళ్ల అమ్మకు తాను వండి వ‌డ్డిస్తాడుట‌. నాయ‌న‌మ్మ‌పై చిరంజీవి ప్రేమ చూపిస్తే..వాళ్ల అమ్మ‌పై తాను అలా ప్రేమ కురిపిస్తాన‌ని చెప్పాడు.

చ‌ర‌ణ్ కి చిన్న‌ప్పుడు డాడ్ అంటే ఎంతో భ‌యం. ఓ సంద‌ర్భంలో బెల్టు తీసుకుని కొట్టిన సంద‌ర్భం ఉంది. అప్ప‌టి నుంచి చ‌ర‌ణ్ కి డాడ్ అంటే భ‌యం. ఇప్ప‌టికీ అదే భ‌యం క‌లుగుతుంద‌ని చాలా సంద‌ర్బాల్లో చెప్పాడు. చిన్నప్ప‌టి నుంచి చ‌ర‌ణ్ అమ్మ పార్టీనే. ఏం కావాల‌న్నా వాళ్ల అమ్మ‌నే అడిగే వారుట‌. టూర్ కి వెళ్లాల‌న్నా? బ‌య‌ట‌కు వెళ్లే అనుతి తీసుకోవాల‌న్నా? అమ్మ రికమండీష‌న్ త‌ప్ప‌ని స‌రి అని గ‌తంలో తెలిపాడు.

ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ తండ్రిని మించిన త‌నయుడిగా ఇండ‌స్ట్రీలో ఎదుగుతోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియాని దాటి గ్లోబ‌ల్ స్టార్ అయ్యాడు. హాలీవుడ్ లో సైతం అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అందుకే త‌న‌యుడి విష‌యంలో చిరంజీవి కూడా ఎంతో గ‌ర్వ‌ప‌డుతుంటారు. పెద్ద పెద్ద చ‌దువులు చ‌ద‌వ క‌పోయినా? సినిమా రంగంలో రాణిస్తున్నంద‌కు ఎంతో సంతోఫ ప‌డాతారు చిరు.