అల్లుడి నిర్మాణంలో మావయ్య మూవీ.. నిజమేనా?
అయితే చిరు హీరోగా అల్లు అర్జున్ నిర్మాతగా తెరకెక్కే సినిమా కోసం రంగం సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
By: Tupaki Desk | 13 Jun 2025 12:29 PMఅల్లుడి నిర్మాణంలో మావయ్య మూవీ.. ఇప్పుడు టాలీవుడ్ సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాను రూపొందించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. రీసెంట్ గా పవన్ నిర్మాణంలో చరణ్ మూవీ ఉంటుందని టాక్ రాగా.. ఇప్పుడు చిరు- బన్నీ ప్రాజెక్ట్ కోసం వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే చిరు హీరోగా అల్లు అర్జున్ నిర్మాతగా తెరకెక్కే సినిమా కోసం రంగం సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఆ మూవీ రూపొందుతుందని టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ డైరెక్టర్.. మెగాస్టార్- ఐకాన్ స్టార్ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించనున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.
ఆ దర్శకుడు ఎవరో తెలియక పోయినా.. మూవీ మాత్రం యాక్షన్ డ్రామా జోనర్ లో తెరకెక్కుతుందని తెలుస్తోంది. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా సామాజిక సందేశంతో కూడిన స్టోరీతో సినిమా రూపొందనుందని సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ నిర్మాతగా డెబ్యూ మూవీ ఇదే కావడంతో ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. నెవ్వర్ బిఫోర్ కాంబినేషన్ అని చెబుతున్నారు. అనుకున్నట్లు ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఫ్యాన్స్ కు పండగేనని కామెంట్లు పెడుతున్నారు. దానిపై చిరు టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక చిరంజీవి, అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ఇప్పుడు ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న విశ్వంభర మూవీని ఇప్పటికే కంప్లీట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది. ఇప్పుడు ఆయన అనిల్ రావిపూడితో వర్క్ చేస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఆ సినిమా షూటింగ్.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.