Begin typing your search above and press return to search.

మెగాస్టార్ 157 వైజాగ్ లోనే మొద‌ల‌వుతుందా?

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభోత్స‌వానికి రంగం సిద్ద‌మ‌వుతోందా? వేస‌వి ముగియ గానే సెట్స్ కి వెళ్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 May 2025 1:50 PM IST
మెగాస్టార్ 157 వైజాగ్ లోనే మొద‌ల‌వుతుందా?
X

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభోత్స‌వానికి రంగం సిద్ద‌మ‌వుతోందా? వేస‌వి ముగియ గానే సెట్స్ కి వెళ్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎండ‌లు తీవ్రంగా ఉన్నాయి. అందుకే యూనిట్ ఇంకా ఆన్ సెట్స్ కు వెళ్ల‌లేదు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. న‌య‌న‌తార తీసుకొ చ్చి అనీల్ మార్క్ ప్ర‌మోష‌న‌ల్ వీడియో కూడా చేసాడు. ఈ వీడియోతోనే ఓ రేంజ్ లో బ‌జ్ క్రియేట్ అయింది.

దీంతో షూటింగ్ ఎప్పుడెప్పుడా? అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈనేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తొలి షెడ్యూల్ వైజాగ్ లో మొద‌లు పెడుతున్న‌ట్లు స‌మాచారం. విశాఖ సమీపంలోని చిరంజీవి సొంత ల్యాండ్స్ లో తొలి షెడ్యూల్ ప్లాన్ చేసారుట‌. ఇది సిటీకి కాస్త దూరంగా ఉంటుంది. అక్క‌డ విలేజ్ వాతావ‌ర‌ణం ఉంటుంది. ఆప్రాంత‌మంతా కొబ్బ‌రి తోట‌ల‌తో ఉంటుంది.

అక్క‌డే చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతుంద‌ని వివ్వ‌స‌నీయ స‌మాచారం. కొన్ని రోజుల పాటు అక్క‌డే షూటింగ్ ఉంటుందిట‌. అటుపై అదే షెడ్యూల్ కి కంటున్యూగా హైద‌రాబాద్ లోనే ఉంటుంద‌ని స‌మాచారం. వైజాగ్ రావ‌డానికి కార‌ణం అనీల్ సెంటిమెంట్ అని వినిపిస్తుంది. అనీల్ ఏ సనిమా స్క్రిప్ట్ అయినా వైజాగ్ లోనే సిద్ద‌మ‌వుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వైజాగ్ పార్క్ హోట‌ల్ లోనే సిద్ద‌మైంది. అ ప్లేస్ లో ఓవైబ్ వుంటుం ద‌ని అక్క‌డే కూర్చుని రాసాడు.

అనీల్ కు ఇష్ట‌మైన ప్లేస్ కూడా వైజాగ్ . ఈ నేప‌థ్యంలో చిరంజీవిని రిక్వెస్ట్ చేసి తొలి షెడ్యూల్ వైజాగ్ లో ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. వైజాగ్ అంటే చిరంజీవికి కూడా అంతే ఇష్టం. ఆయ‌న సొంత స్థ‌లాల్లో స్టూడియోలు కూడా క‌ట్టాల‌ని చూస్తున్నారు. ఇప్పుడు అదే ప్లేస్ లో తొలి షెడ్యూల్ కి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.