చిరంజీవి అప్పుడు చేసిన ప్రామిస్ ఇప్పటికి ?
వాస్తవానికి ఆ పాత్ర కోసం క్యాథరీన్ తీసుకోవాలనుకున్నారు. అప్పటికి క్యాథరీన్ మంచి ఫాంలో ఉంది.
By: Tupaki Desk | 24 July 2025 1:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి `ఖైదీ నెంబర్ 150`వ చిత్రంతో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు రిటైర్మెట్ ప్రకటించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. ఎంతో మంది దర్శకుల్ని పరిశీలించి చివరికి వి. వినాయక్ ను దర్శకుడిగా ఫైనల్ చేసారు. కోలీవుడ్ లో విజయ్ నటించిన `కత్తి` సినిమాకు రీమేక్ రూపం ఇది. మాతృకను మురగదాస్ తెరకెక్కించగా....రీమేక్ అవకాశం ఆయనకు కూడా ఇచ్చారు. కానీ ఆ ఛాన్స్ ను సున్నితంగా తిరస్కరించారు. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు.
వాస్తవానికి ఆ పాత్ర కోసం క్యాథరీన్ తీసుకోవాలనుకున్నారు. అప్పటికి క్యాథరీన్ మంచి ఫాంలో ఉంది. ఈనేపథ్యంలో హీరోయిన్ గా ఆమె పేరు తె రపైకి వచ్చింది. కానీ ఆమె కంటే కాజల్ అయితే బాగుంటుందని ఆలోచన విరమించుకున్నారుఏ. అనంతరం అదే సినిమాలో ఐటం పాట కోసమైనా క్యాథరీన్ ను తీసుకో వాలనుకున్నారు కానీ అదీ సాధ్యపడలేదు. రత్తాలు పాట కోసం రాయ్ లక్ష్మిని తీసుకున్నారు. అలా చిరం జీవి క్యాథరీన్ కు బాకీ పడిపోయారు.
ఆ తర్వాత చిరజీవి చాలా సినిమాలు చేసారు. కానీ ఏ సినిమాలోనూ క్యాథరీన్ కు అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో క్యాథరీన్ గ్రాఫ్ కూడా పడిపోయింది. అలా చిరుతో ఛాన్స్ కు దూరమవ్వాల్సి వచ్చింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడా ఛాన్స్ 157వ సినిమాతో నిరూపిం చుకుంటున్నారు. అనీల్ రావిపూడి దర్శ కత్వంలో చిరంజీవి 157వ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవికి జోడీగా నయ నతార నటిస్తోంది. మరో లీడ్ రోల్ లేదా? ఐటం పాటలో క్యాథరీన్ నటించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఆమె ఎంట్రీ ఖరారైంది. కానీ అది పాత్ర కోసమా? ఐటం పాట కోసమా? అన్నది క్లారిటీ లేదు. ఈ విషయంలో చొరవ తీసుకుంది చిరంజీవి. ఆ రోల్ కోసం అనీల్ మరో నటిని అనుకున్నారుట. కానీ చిరం జీవి అడగడంతో ఆయన మాట కాదనలేక అనీల్ క్యాథరీన్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
