157 తోనైనా సెంటిమెంట్ మారేనా?
గతంలో చిరంజీవి హీరోగా నటించిన `సైరా నరసింహారెడ్డి`లో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియాలో భారీ అంచనాల మద్య రిలీజ్ అయింది.
By: Tupaki Desk | 23 Aug 2025 8:19 PM ISTమెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి అసలు పేరునే ( మన శంకర వర ప్రసాద్ గారు) అనీల్ సినిమా టైటిల్ గా పెట్టేసాడు. ముందు శివ అనే పదాన్ని తొలగించి మన ఒకటి గా యాడ్ చేసి టైటిల్ నిర్ణయించారు. ఇలా ఓ సినిమాకు నేరుగా చిరంజీవి పేరునే టైటిల్ గా పెట్టడం అన్నది అతి పెద్ద సాహసమే. టైటిల్ ని జస్ట్ ఫై చేస్తూ కథ సాగుతూ ఉండాలి. అయితే ఈ సినిమా పూర్తిగా హాస్య భరితంగా ఉంటుందని ముందే రివీల్ చేసారు.
సందేహాలకు చెక్:
ఆ కథ నచ్చే చిరంజీవి అంగీకరించారు. ఆయన ఎంతో ఇష్టపడి చేస్తోన్న సినిమా ఇది. చాలా కాలం తర్వాత మనస్పుర్తిగా హాయిగా నవ్వుకునే చిత్రమవుతుందని చిరంజీవి ధీమా వ్యక్తం చేసారు. హిట్ మెషిన్ గా పేరు న్న అనీల్ రావిపూడి ఈ సినిమాతో చిరంజీవికి గ్రాండ్ హిట్ అందిస్తాడని నమ్మకం అందరిలోనూ ఉంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే హీరోయిన్ గా నయనతార నటించడం పలు సందేహాలకు తావిస్తోంది. నయన్ బ్యాడ్ సెంటిమెంట్ ఈసినిమాకు వెంటాడుతుందా? అన్నసందేహం కొందరిలో లేకపోలేదు.
రీమేక్ అయినా ప్లాప్:
గతంలో చిరంజీవి హీరోగా నటించిన `సైరా నరసింహారెడ్డి`లో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియాలో భారీ అంచనాల మద్య రిలీజ్ అయింది. కానీ వాటిని అందుకోవడంలో విపల మైంది. అందులో చిరంజీవి భార్య పాత్రలో నయన్ నటించింది. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి హీరోగా నటించిన `గాడ్ ఫాదర్` చిత్రంలో నటించింది నయన్. ఇందులో సిస్టర్ పాత్ర పోషించింది. భారీ అంచ నాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఇది ఓ రీమేక్ సినిమా అయినా సక్సెస్ అవ్వలేదు.
భారీ అంచనాలున్న కాంబో:
అలా నయనతార-చిరంజీవి కాంబినేషన్ అంటే ఓ బ్యాండ్ సెంట్ మెంట్ అప్పటి నుంచీ ఉంది. ఈ నేపథ్యం లో చిరంజీవి 157వ సినిమాకు నయన్ ఎంపిక చేయడంపై కొంత చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమా హిట్ తో ఆ బ్యాడ్ సెంటిమెంట్ చెరిగిపోతుందని మెగా అభిమానులు సహా ప్రేక్షకులు ధీమగా ఉన్నారు. అనీల్ రావిపూడి రాసిన కథ కు మెగా ఇమేజ్ తోడైన నేపథ్యంలో బజ్ పీక్స్ లో ఉందని..అన్ని రకాల ప్లాప్ లకు ఈ కాంబినేషన్ చెక్ పెడుతుందని అంతా భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
