Begin typing your search above and press return to search.

బాస్ నువ్వు కూడానా.. రాజశేఖర్ ను వాడేశావుగా

రాజశేఖర్ స్టైల్ లో చిరంజీవి తన చేతులను ఊపుతూ డ్యాన్స్ చేశారు

By:  Tupaki Desk   |   28 July 2023 6:16 AM GMT
బాస్ నువ్వు కూడానా.. రాజశేఖర్ ను వాడేశావుగా
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేశ్ దర్శకత్వంలో కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడం వల్ల సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో చిరు చేసిన ఓ సన్నివేశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో యాంగ్రీ‌మెన్ రాజశేఖర్ పేరు బాగా ట్రెండ్ అవుతోంది.

మ్యాటర్ లోకి వెళితే.. రాజశేఖర్ డ్యాన్స్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన ప్రస్తావన వచ్చిందంటే.. అందులో కచ్చితంగా ఆయన డ్యాన్స్‌ గురించి కూడా మాట్లాడుకుంటారు. అయితే ఆయనకు కూడా ఓ మార్క్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని చిరు ఇమిటేట్ చేయడమే చర్చనీయాంశమైంది. 'భోళా శంకర్' సినిమా ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచిన మూవీటీమ్ టీమ్.. తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది.

చిరు ఫాన్స్ కోరుకునే అన్ని మాస్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. చిరు డ్యాన్స్, ఫైట్స్, ఎలివేషన్స్ సీన్స్, డైలాగ్స్, సాంగ్స్,.. అన్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ప్రచార చిత్రంలో ఓ షాట్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఇందులో యాంగ్రీ హీరో రాజశేఖర్ మ్యానరిజమ్స్ ను చిరు ఇమిటేట్ చేస్తూ కనిపించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి ఆ షాట్ కూడా చూస్తుంటే అలానే అనిపిస్తోంది. రాజశేఖర్ స్టైల్ లో చిరంజీవి తన చేతులను ఊపుతూ డ్యాన్స్ చేశారు. అది ఒక కామెడీ సీన్ లా అనిపిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలోనూ రాజశేఖర్ డ్యాన్స్ ను ఇమిటేట్ చేస్తూ డైలాగ్స్ చెప్పడం జరిగింది. దీనిపై అప్పట్లో జీవిత రాజశేఖర్ అసహనం కూడా వ్యక్తం చేశారు. రాజశేఖర్ ను ఎంతో అవమానించారని పేర్కొన్నారు.

దీంతో ఇప్పుడు భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి కూడా రాజశేఖర్ డ్యాన్స్ ను ఇమిటేట్ చేయం ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో అని నెటిజన్లు అనుకుంటున్నారు. కానీ ఆ సీన్.. ప్రచార చిత్రంలో చిన్న షాట్ గానే చూపించారు. మరి సినిమాలో నిజంగానే రాజశేఖర్ ను పూర్తిస్థాయిలో ఇమిటేట్ చేస్తూ చిరు చేశారో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి ఉండాల్సిందే.