టెక్నాలజీ కాదు మనుషులే సమస్య అంటున్న చిన్మయి..!
సోషల్ మీడియా ఈ రోజుల్లో.. సాధారణ ప్రజలకే కాదు.. సెలబ్రిటీల అభిప్రాయాలకు కూడా పెద్ద వేదికగా మారింది.
By: Priya Chowdhary Nuthalapti | 4 Jan 2026 1:06 PM ISTసోషల్ మీడియా ఈ రోజుల్లో.. సాధారణ ప్రజలకే కాదు.. సెలబ్రిటీల అభిప్రాయాలకు కూడా పెద్ద వేదికగా మారింది. ఎవరు ఏమనుకున్నా కానీ ఈ సోషల్ మీడియాలో పెడితే అది కాస్త పెద్ద చర్చగా మారుతుంది. కొంతమంది సెలబ్రిటీలు అయితే ఈ సోషల్ మీడియా వాడుకొని తమ అభిప్రాయాలని అక్కడ పెడుతూ ఎన్నో చర్చలకు దారితీస్తూ ఉంటారు. అలాంటి వారిలో ముందుండే పేరు ప్రముఖ సింగర్ డబ్బింగ్, ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. ఆమె ఇటీవల చేసిన ఒక AIపై వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి.
అమ్మాయిల గురించి చిన్న మాట అన్నా కూడా గట్టిగా స్పందించే సెలబ్రిటీల్లో.. చిన్మయి పేరు తప్పక వినిపిస్తుంది. గతంలో చిన్న చిన్న కామెంట్లకే చిన్మయి చేసిన ఘాటు రిప్లైలు పెద్ద చర్చలకు దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల నటుడు శివాజీ విషయంలో కూడా ఆమె.. స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈసారి చిన్మయి చేసిన పోస్ట్ AI గురించి కావడం గమనార్హం. “AI ప్రమాదకరం కాదు. దాన్ని వాడే మనుషులే ప్రమాదకరం” అంటూ ఆమె చేసిన వ్యాఖ్య హాట్ టాపిక్ అయింది. దీనిపై ఓ యూజర్ “ఇప్పటి కాలంలో AI చాలా డేంజరస్ అవుతోంది” అంటూ కామెంట్ చేయగా.. చిన్మయి తన అభిప్రాయం స్పష్టంగా చెప్పింది. టెక్నాలజీ కంటే దాన్ని మనం ఎలా వాడుతున్నామన్నదే అసలు సమస్య అని ఆమె అభిప్రాయం.
అయితే ఈ పోస్ట్ కింద వచ్చిన మరో కామెంట్ వివాదానికి కారణమైంది. “అందరూ యూజర్లు డేంజరస్ కాదు” అంటూ ఓ అకౌంట్ వ్యాఖ్యానించడంతో, చిన్మయి “నేను ఎక్కడా అందరూ అని చెప్పానా?” అంటూ ఘాటుగా స్పందించింది. ఈ ఒక్క రిప్లైతోనే నెటిజన్ల మధ్య పెద్ద చర్చ మొదలైంది. కొందరు చిన్మయి మాటలకు మద్దతుగా నిలిచితే.. మరికొందరు ఆమె ప్రతి విషయాన్నీ వాదనగా మార్చేస్తుందని విమర్శిస్తున్నారు.
చిన్మయి గతంలో కూడా అమ్మాయిలకు అన్యాయం జరిగిందని అనిపించిన ప్రతి సందర్భంలో తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పింది. సెలబ్రిటీలు మహిళలపై చేసిన వ్యాఖ్యలు అయినా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయినా ఆమె మౌనంగా ఉండదు. అందుకే ఆమె చేసే ప్రతి పోస్ట్..ప్రతి రిప్లై వైరల్ అవుతుంది.
వ్యక్తిగత జీవితానికి వస్తే, చిన్మయి నటుడు.. దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ ను.. వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాహుల్ ఇటీవల “గర్ల్‌ఫ్రెండ్” సినిమాతో మంచి విజయం అందుకున్నారు.
