Begin typing your search above and press return to search.

'వాళ్లంతా టెర్రరిస్టులే'.. సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్

స్టార్ సింగర్ చిన్మయి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తుంటుందన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 April 2025 8:14 PM IST
వాళ్లంతా టెర్రరిస్టులే.. సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్
X

స్టార్ సింగర్ చిన్మయి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తుంటుందన్న విషయం తెలిసిందే. తరచూ సోషల్ మీడియాలో వివిధ అంశాలపై పోస్టులు పెడుతుంటోంది. ఇప్పుడు జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై సర్వత్రా స్పందిస్తున్న వేళ.. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

కులం ఆధారంగా తక్కువ చేసి చూసినవాళ్లంతా టెర్రరిస్టులని చిన్మయి ఆరోపించింది. మతం కాదు.. ఆధిపత్యం చెలాయిస్తూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారని, తాను హిందువుల్లో ఒకరని మర్చిపోయారని రాసుకొచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో మనం అంగీకరించడానికి లేదా ప్రశ్నించడానికి నిరాకరించే సత్యం అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

"నేను ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తిని. అది కూడా షెడ్యూల్డ్ తెగ. సోకాల్డ్ హిందువులు.. నేను వారిలో ఒకరు అని మర్చిపోయారు. ఎందుకంటే మా ఊరిలో గుడికి వెళ్తే పూజారి నేరుగా నాకు ప్రసాదం ఇవ్వలేదు.. ఇచ్చేవారు కాదు.. అది నేను చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్నాను. కాలేజీ రోజుల్లో కూడా అంతే" అని రాసుకొచ్చింది.

"రిజర్వేషన్ల వల్ల మా నెత్తిపై మీరు కూర్చునేవారని అనే వారు. అలాంటి అవమానాలు నేను ఎదుర్కొన్నా. చాలా బాధగా ఉండేదు. నా చుట్టూ ఉన్న అగ్రకులాలకు, అగ్రవర్ణాలకు చెందిన వారు కులాన్ని బట్టి వివక్ష చూపించేవాలుచూపేవారు ఉగ్రవాదులతో సమానం. అలా అని నాకు ఎన్నోసార్లు అనిపించింది" అని తెలిపింది.

"దాని వల్ల నా మానసిక ఆరోగ్యం చాల దెబ్బతింది. కానీ ఇప్పటి వరకు కులం మీద సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. రెండింటి మధ్య తేడా ఏం లేదు. కొందరు మతం ఆధారం హత్య చేస్తున్నారు. మరికొందరు ఆధిపత్యం ఆధారంగా మానసిక ఆరోగ్యాన్ని చంపేస్తున్నారు" అంటూ చిన్మయి శ్రీపాద ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ప్రస్తుతం చిన్మయి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ పోస్ట్ ఏంటి.. క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నారు. కొందరు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిన్మయి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.