Begin typing your search above and press return to search.

అదరగొట్టిన 'చైనా పీస్' టీజర్

తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   26 July 2025 5:18 PM IST
అదరగొట్టిన చైనా పీస్ టీజర్
X

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు కీలక పాత్ర పోషించారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారం శత్రువుల చేతికి చిక్కుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలని చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. ఈ స్పై డ్రామాలో నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ పాత్రలని తీర్చిదిద్దిన విధానం చాలా యూనిక్‌గా ఉంది.

ఓ మామూలు కుర్రాడైన నిహాల్‌ను టెర్రరిస్ట్‌గా కస్టడీలో తీసుకోవడం, అతని గురించి చేసే విచారణ ఆసక్తికరంగా ఉంది. నిహాల్ శ్రీశ్రీ కవితను తెలుగు ఉర్దూలో కలిపి చెప్పిన విధానం నవ్విస్తుంది. నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి చాలా యూనిక్ స్టోరీ లైన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. కాన్సెప్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.