Begin typing your search above and press return to search.

హీరో హీరోయిన్‌ గా 'పొన్నియన్‌ సెల్వన్' పిల్లలు

ఐశ్వర్య రాయ్‌ పోషించిన నందిత పాత్ర చిన్నప్పటి పాత్రలో సారా అర్జున్‌ కనిపించింది. ఇక విక్రమ్ చిన్నప్పటి పాత్రలో సంతోష్ నటించాడు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 6:08 AM GMT
హీరో హీరోయిన్‌ గా పొన్నియన్‌ సెల్వన్ పిల్లలు
X

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్‌ సినిమాలో భారీ తారాగణం నటించిన విషయం తెల్సిందే. అంత మంది నటించినా కూడా ఐశ్వర్యరాయ్ మరియు విక్రమ్‌ చిన్నప్పటి పాత్రల్లో నటించిన పిల్లలు మాత్రం అందరికి సుపరిచితంగా నిలిచారు. వారి పాత్రలు ఎప్పటికి గుర్తుండి పోతాయి అనడంలో సందేహం లేదు.

ఐశ్వర్య రాయ్‌ పోషించిన నందిత పాత్ర చిన్నప్పటి పాత్రలో సారా అర్జున్‌ కనిపించింది. ఇక విక్రమ్ చిన్నప్పటి పాత్రలో సంతోష్ నటించాడు. సాదారణంగా బాల నటీ నటులుగా నటించిన వారు హీరోలుగా హీరోయిన్స్ గా నటించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పొన్నియన్‌ సెల్వన్ వచ్చి మూడు ఏళ్లు కూడా నిండా పూర్తి అవ్వలేదు అప్పుడే వారు హీరో హీరోయిన్‌ గా నటించేందుకు రెడీ అయ్యారు.

మరో విశేషం ఏంటి అంటే పొన్నియన్ సెల్వన్‌ లో బాల నటులుగా జంటగా నటించిన వారు ఇప్పుడు హీరో హీరోయిన్‌ గా జంటగా నటించేందుకు రెడీ అవుతున్నారు. సనా మరియం దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో వీరిద్దరూ కలిసి హీరో హీరోయిన్ గా నటించబోతున్నారు.

కొన్నాళ్లుగా సారా అర్జున్ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. అమ్మాయి ఇప్పుడు బాల నటిగా కాదు మంచి కమర్షియల్‌ హీరోయిన్ అన్నట్లుగా ఉందని ఇప్పటికే ఆమె ను చూసిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో సారా అర్జున్‌ అందమైన ఫోటోలు మరియు వీడియో లు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా పొన్నియన్‌ సెల్వన్‌ జోడీ మళ్లీ రిపీట్ అవ్వబోతుంది అంటూ తమిళ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. పొన్నియన్ సెల్వన్‌ తో వచ్చిన గుర్తింపు కారణంగా వీరిద్దరు హీరో హీరోయిన్ గా సక్సెస్ అవుతారేమో చూడాలి.