Begin typing your search above and press return to search.

హిట్టు కాన్ఫిడెన్స్ బాగుంది బాసు..!

ఈ సినిమా మలయాళంలో ఎలా అయితే ప్రేక్షకులను అలరించిందో తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు డైరెక్టర్ చిదంబరం.

By:  Tupaki Desk   |   3 April 2024 9:30 AM GMT
హిట్టు కాన్ఫిడెన్స్ బాగుంది బాసు..!
X

మలయాళ సినీ చరిత్రలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా మంజుమ్మల్ బోయ్స్. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రిలీజైన ఈ సినిమా మలయాళంలో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. స్టార్ డైరెక్టర్, స్టార్ యాక్టర్ వీళ్లెవరు లేకుండానే మంజుమ్మల్ బోయ్స్ సెన్సేషనల్ హిట్ అందుకుంది. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన మంజుమ్మల్ బోయ్స్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమా మలయాళంలో ఎలా అయితే ప్రేక్షకులను అలరించిందో తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు డైరెక్టర్ చిదంబరం. ఇది రెగ్యులర్ ఫార్మెట్ సినిమా కాదు కచ్చితంగా ఆడియన్స్ కు ఎగ్జైట్మెంట్ కలిగేలా చేస్తుందని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నారు డైరెక్టర్ చిదంబరం.

ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి అంటే ఫ్రెండ్స్ అంతా కలిసి కొడైకెనాల్ ట్రిప్ వేస్తారు. అయితే అందులో ఒక ఫ్రెండ్ గుణ కేవ్స్ లో చిక్కుకుంటాడు. అతన్ని కాపాడేందుకు మిగతా ఫ్రెండ్స్ ఎలా తమ ప్రాణాలను పణంగా పెట్టారు అన్నది కథ. ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బసితో నటించారు. ఈ సినిమాను షాన్ ఫిలింస్ బ్యానర్ లో బాహు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ కలిసి నిర్మించారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్యనే మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలు తెలుగులో రిలీజై ఇక్కడ మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు అదే దారిలో మంజుమ్మల్ బోయ్స్ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని వస్తుంది. ఏప్రిల్ 6న మంజుమ్మల్ బోయ్స్ తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై ఇంప్రెస్ చేసింది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ ఓ పక్క భారీ సినిమాలు చేస్తుండగా ఈమధ్య డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా అదరగొట్టేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తుండగా ఓ భాషలో హిట్టైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మైత్రి మేకర్స్.