చోరీ 2 టాక్ ఎలా ఉంది..?
చోరీ 2 కథ విషయానికి వస్తే.. సాక్షి (నుష్రత్ భరూచా) తన భర్త రాజ్ బీర్ అలియాస్ హేమంత్ (సౌరభ్ గోయల్) ని హత్య చేశానని పోలీసులకు లొంగిపోతుంది.
By: Tupaki Desk | 11 April 2025 11:23 PM ISTమరాఠి సినిమా లాపాచ్చపి సినిమాను రీమేక్ చేసి చోరీ అని హిందీలో ఒక మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా 2021 లో అమెజాన్ ప్రైం లో రిలీజైంది. విశాల్ ఫ్యూరియా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నుష్రత్ భరూచా నటించారు. హర్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చోరీ ప్రేక్షకులను మెప్పించడంతో లేటెస్ట్ గా చోరీ 2 అని మరో సినిమా తీశారు. లేటెస్ట్ గా ఈ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైం లో రిలీజైంది. చోరీ సూపర్ హిట్ కాగా చోరీ 2 ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుందా అన్నది తెలియాలంటే అసలు మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.
చోరీ 2 కథ విషయానికి వస్తే.. సాక్షి (నుష్రత్ భరూచా) తన భర్త రాజ్ బీర్ అలియాస్ హేమంత్ (సౌరభ్ గోయల్) ని హత్య చేశానని పోలీసులకు లొంగిపోతుంది. ఐతే సరైన ఆధారాలు లేకపోవడం వల్ల సాక్షిని పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేస్తారు. ఆ తర్వాత సాక్షి తన కూతురు ఇషాని (హార్ధిక శర్మ) తో కలిసి సిటీకి వెళ్తుంది. అక్కడ టీచర్ గా పనిచేస్తున్న సాక్షి ఎండలో ఉండకూడని ఇషానిని చాలా జాగ్రత్తగా పెంచుతుంది. ఇదిలాఉంటే సాక్షి కూతురు ఇషానిని కొందరు కిడ్నాప్ చేసి ఊరు తీసుకెళ్తారు. ఇంతకీ ఇషానిని ఎందుకు కిడ్నాప్ చేశారు..? వాళ్లు ఆమెను ఏం చేశారు..? కూతురు కోసం సాక్షి ఏం చేసింది..? అన్నది చోరీ 2 కథ.
చోరీ హిట్ అవ్వడంతో కామన్ గానే పార్ట్ 2 మీద ఆసక్తి ఉంటుంది. హర్రర్ సినిమాల్లో సోషల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం చోరీ 2కి ప్లస్ అయ్యింది. చోరీ 1 చూడకపోయినా దాని గురించి కూడా కొన్ని సీన్స్ చెప్పడం డైరెక్టర్ బ్రిలియన్స్ ని మెచ్చుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా హర్రర్ ఎలిమెంట్స్ తో తీసుకెళ్తాడు. సెకండ్ హాఫ్ లో హర్రర్ సీన్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ సీన్స్ అలరిస్తాయి. ఐతే సెకండ్ హాఫ్ లోనే అక్కడక్కడ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ రిపీటెడ్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఒక క్లైమాక్స్ కూడా థ్రిల్ చేస్తుంది.
ఛోరీ 2లో నుష్రత్ భరూచా మంచి నటన కనబరిచారు. క్లైమాక్స్ లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. హార్ధిక శర్మ కూడా ఇంప్రెస్ చేసింది. సోహా అలి ఖాన్ కూడా పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన వారు కూడా పాత్రల పరిధి మేరకు మెప్పించారు. హర్రర్ థ్రిల్లర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నా సినిమాలో ల్యాగ్ సీన్స్ వల్ల కాస్త ఇంప్రెషన్ తగ్గుతుంది.
డైరెక్టర్ విశాల్ ఫ్యూరియా బెస్ట్ వర్క్ అందించారు. ఐతే ఫస్ట్ హాఫ్ డీల్ చేసిన విధంగా సెకండ్ హాఫ్ కూడా కొనసాగిస్తే బాగుండేది. చోరీ సినిమా లవర్స్ కి పార్ట్ 2 జస్ట్ ఓకే అనిపించేలా ఉంటుంది.
