చెన్నై మెట్రో రైలు సబ్ వే లో చిక్కుకుపోయింది.. అసలేం జరిగింది..!
చెన్నై మెట్రో రైలు సబ్ వే లో చిక్కుకుపోయింది. ఇందులో భాగంగా... విమ్కో నగర్ డిపో నుచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వైపు వెళ్లే మెట్రో ట్రైన్.. సెంట్రల్ మెట్రో - హైకోర్టు స్టేషన్ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయింది.
By: Tupaki Desk | 2 Dec 2025 11:45 AM ISTచెన్నై మెట్రో రైలు సబ్ వే లో చిక్కుకుపోయింది. ఇందులో భాగంగా... విమ్కో నగర్ డిపో నుచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వైపు వెళ్లే మెట్రో ట్రైన్.. సెంట్రల్ మెట్రో - హైకోర్టు స్టేషన్ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో.. అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో.. వారు మధ్యలోనే దిగి, రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి!
అవును... చెన్నైలో ఓ ఆందోళనకర విషయం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా...విమ్కో నగర్ డిపో నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వైపు వెళ్లే మెట్రో ట్రైన్.. సెంట్రల్ మెట్రో - హైకోర్టు స్టేషన్ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయింది. సెంట్రల్ మెట్రో - హైకోర్టు స్టేషన్ల మధ్య ఉన్న మెట్రో రైలు బ్లూ లైన్ లో విద్యుత్ సరఫరాలో సమస్య వల్ల ఈ అసౌకర్యం తలెత్తినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.
ఈ సమయంలో... పది నిమిషాల పాటు సబ్ వే లో మెట్రో ట్రైన్ నిలిచిపోయిందని.. దీంతో, పట్టాల మీదుగా సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న హైకోర్టు మెట్రో స్టేషన్ కు నడిచివెళ్లాలని అధికారులు కోరినట్లు ప్రయాణికులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదే క్రమంలో.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చెన్నై మెట్రో రైలు అధికారులు క్షమాపణలు చెప్పరు.
అనంతరం తాజాగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన చెన్నై మెట్రో రైలు... బ్లూ లైన్ లో ఎయిర్ పోర్ట్, విమ్కో నగర్ డిపో మధ్య మెట్రో రైలు సేవలు సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. పురుచ్చి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ మెట్రో నుంచి గ్రీన్ లైన్ లో సెయింట్ థామస్ మౌంట్ వరకూ కూడా సాధారణ షెడ్యూల్ ప్రకారం రైలు నడుస్తున్నాయని తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న ఒక వీడియోలో... సొరంగం నుంచి ప్రయాణికులు హ్యాండ్ రైల్ లను పట్టుకుని పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి బయటకు చూస్తున్నట్లు కనిపించగా.. మరొక వీడియోలో ప్రయాణికులు క్యూలో నిలబడి సొరంగం గుండా నడుస్తున్నట్లు కనిపించింది. ఆ సమయంలో సిబ్బంది వారికి మార్గనిర్దేశం చేస్తున్నారు.
