Begin typing your search above and press return to search.

అబ్బవరం 'వదలనే'.. యూత్‌ కు కనెక్ట్ అయ్యేలా..

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ నుంచి విడుదలైన రెండో పాట వదలనే.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.

By:  M Prashanth   |   26 May 2026 3:13 PM IST
అబ్బవరం వదలనే.. యూత్‌ కు కనెక్ట్ అయ్యేలా..
X

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ నుంచి విడుదలైన రెండో పాట వదలనే.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకుంటోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి తన మ్యూజిక్ మ్యాజిక్ చూపించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'నను నేను వదిలినా.. నిను వదలనే..' అంటూ సాగే ఆ మెలొడీ సాంగ్ యూత్‌ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది.




ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్, ఎమోషనల్ రిలేషన్‌ షిప్స్‌ కు కనెక్ట్ అయ్యేలా పాట ఉండటంతో యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సాంగ్ కు ఫేమస్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ హైలైట్‌ గా నిలిచాయి. ప్రతి లైన్‌ లోనూ ప్రేమలోని ఎమోషన్ కనిపించేలా రాసిన పదాలు ఆకట్టుకుంటున్నాయి. సింగర్ జావేద్ అలీ తన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. తన వాయిస్ తో ఫిదా చేశారు.

అలా మణిశర్మ కంపోజిషన్, జావేద్ అలీ వాయిస్, అనంత శ్రీరామ్ లిరిక్స్ కలిసి ఆ పాటను పక్కా సోల్‌ ఫుల్ మెలోడీగా మార్చేశాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సినిమాలో హీరోగా కిరణ్ అబ్బవరం నటిస్తుండగా, హీరోయిన్‌ గా శ్రీ గౌరి ప్రియ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌ లో వీరిద్దరి కెమిస్ట్రీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వదలనే పాటలో కూడా వారి లవ్ ట్రాక్ ఎంతో నేచురల్‌ గా కనిపిస్తోంది.

ముఖ్యంగా చెన్నై బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందించిన విజువల్స్ పాటకు మరింత ఫీల్ తీసుకొచ్చాయి. అయితే చిత్రానికి దర్శకుడు రవి నంబూరి కాగా.. కథను సాయి రాజేష్ అందిస్తున్నారు. బేబీ వంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి రాజేష్ కథతో సినిమా రూపొందుతుండటంతో అంచనాలు పెరిగాయి. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అదే సమయంలో వదలనే పాటను హైదరాబాద్‌ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌ లో లాంచ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి చేతుల మీదుగా సాంగ్ విడుదలైంది. ఆ కార్యక్రమానికి టాలీవుడ్‌ కు చెందిన పలువురు సంగీత దర్శకులు హాజరై సందడి చేశారు. అనూప్ రూబెన్స్, కల్యాణి మాలిక్, వివేక్ సాగర్ తదితరులు మ్యూజికల్ ఈవెంట్‌ లో పాల్గొన్నారు.

ఇటీవల అబ్బవరం తన సినిమాల ఎంపికలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి పూర్తి ఎమోషనల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరోవైపు బేబీ తరహాలోనే రియల్ ఎమోషన్స్‌ తో కూడిన ప్రేమకథను సినిమా చూపించబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా వదలనే పాట చూస్తుంటే.. చెన్నై లవ్ స్టోరీ మూవీ పక్కాగా యూత్‌ ను టార్గెట్ చేస్తోందనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్, లవ్ స్టోరీలను ఇష్టపడే ఆడియన్స్ కు సినిమా కంప్లీట్ గా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.