గ్లింప్స్ తోనే ట్రేడ్ వర్గాల్లో మంచి డిమాండ్
చెన్నై లవ్ స్టోరీ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా గ్లింప్స్ తోనే ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది.
By: Tupaki Desk | 5 Jun 2025 1:36 PM ISTకలర్ ఫోటో, బేబీ లాంటి కల్ట్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న బ్లాక్ బస్టర్ నిర్మాత, డైరెక్టర్ సాయి రాజేష్, ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్టు కోసం ప్రముఖ నిర్మాత SKNతో జతకట్టాడు. వీరిద్దరూ కలిసి రీసెంట్ గా ఓ సినిమాను అనౌన్స్ చేశారు. కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రీసెంట్ గానే రిలీజయ్యాయి.
చెన్నై లవ్ స్టోరీ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా గ్లింప్స్ తోనే ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది. చెన్నై లవ్ స్టోరీ అనౌన్స్‌మెంట్, దాని కాన్సెప్ట్ మరియు మణిశర్మ సౌండ్ ట్రాక్ వల్ల చెన్నై లవ్ స్టోరీ అందరినీ ఆకట్టుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాను మణిశర్మ మ్యూజిక్ చాలా ప్లస్. ఆయన తన మ్యూజిక్ తో ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.
మెలోడీ బ్రహ్మగా పిలవబడే మణిశర్మకు బాగా ఆయనకెంతో ఇష్టమైన లవ్ స్టోరీకి మ్యూజిక్ అందిస్తుండటంతో చెన్నై లవ్ స్టోరీ తప్పకుండా చార్ట్ బస్టర్ ఆల్బమ్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సాయి రాజేష్, SKN మరో కల్ట్ కథ కోసం తొందర పడకుండా రెండేళ్ల పాటూ మంచి కథ కోసం వెయిట్ చేసి ఇప్పుడు దాన్ని పట్టాలెక్కిస్తున్నారు.
చెన్నై లవ్ స్టోరీ గ్లింప్స్ చూస్తుంటే బేబీ టీమ్ నుంచి ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ రాబోతున్న ఫీలింగే వస్తోంది. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటూ సినిమాపై అంచనాలను కూడా బాగా పెంచేసింది. దానికి తోడు, సాయి రాజేష్, SKN కాంబినేషన్ కు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి డిమాండ్ ఉండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి ఆసక్తి నెలకొంది.
