Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్, చిరంజీవి స‌హా అంద‌రికీ అదే షెల్ట‌ర్!

న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ - లెజెండ‌రీ డైరెక్ట‌ర్ తాతినేని ప్ర‌కాశ‌రావు మ‌ధ్య అప్ప‌ట్లో ఎంతో మంది అనుబం ధం ఉండేది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 7:00 AM IST
ఎన్టీఆర్, చిరంజీవి స‌హా అంద‌రికీ అదే షెల్ట‌ర్!
X

న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ - లెజెండ‌రీ డైరెక్ట‌ర్ తాతినేని ప్ర‌కాశ‌రావు మ‌ధ్య అప్ప‌ట్లో ఎంతో మంది అనుబం ధం ఉండేది. తాతినేని తొలి సినిమా ప‌ల్లెటూరు ఎన్టీఆర్ తోనే తెర‌కెక్కించారు. ఇద్ద‌రి కెరీర్ దాదాపు ఒకే సారి ప్రారంభ‌మైంది. అలా ఇద్ద‌రు మ‌ద్రాస్ లో ఎంతో క్లోజ్ గా ఉండేవారు. డైరెక్ట‌ర్ గా తాతినేని ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు తెర‌కెక్కించారు. అప్ప‌ట్లోనే తెలుగు తో పాటు త‌మిళ్, హిందీ భాష‌ల్లో సినిమాలు తెరకెక్కించిన ఓ లెజెండ్ ఆయ‌న‌.

తాజాగా తాతినేని త‌న‌యుడు ప్ర‌సాద్ వాళ్లిద్ద‌రి అనుబంధంతో పాటు ఇప్పుడు స్టార్లుగా వెలిగిపోతున్న వారంతా? చెన్నైలో అప్ప‌ట్లో ఎలా ఉండేవారు అన్న‌ది రివీల్ చేసారు. అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే... `1952 లో నేను జ‌న్మించాను. అదే ఏడాది నాన్న‌గారు `ప‌ల్లెటూరు` సినిమాతో దర్శ‌కుడిగా ప‌నిచేసారు. ఈ సంగ‌తి నాకు అమ్మ చెప్పారు. మ‌ద్రాస్ లో రిప‌బ్లిక్ గార్గెన్ పేరుతో ఓ బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో 12 రూములుండేవి.

ఒక రూమ్ లో నాన్న గారు..మ‌రో రూమ్ లో రామారావుగారు, ఎస్వీ రంగారావు గారు క‌లిసి ఉండేవారట‌. కొన్ని రోజుల‌కు వాళ్లిద్ద‌రితోపాటు పుండరీకాక్షయ్య గారు చేరారుట‌. అప్ప‌ట్లో వాళ్లంతా క‌లిసి సినిమా అవ‌కాశాల కోసం సైకిల్ పై తిరిగేవారుట‌. సైకిలు కూడా లేక‌పోతే ఎంత దూర‌మైనా నడిచి వెళ్లేవారుట‌. కానీ ఎన్టీఆర్ గారు .. ఎస్వీఆర్ గారు మాత్రం ఎక్కువ‌గా క‌లిసే ప్ర‌య‌త్నాలు చేసేవారుట . అదీ ఒకే సైకిల్ పై స్టూడియో లకు వెళ్లేవారట.

కొంత కాల‌నికి రామారావు గారు న‌టులుగా, నాన్న‌గారు ద‌ర్శ‌కులుగా మారారు. న‌టులుగా రామారావు-రంగారావు గారు ఒకే స్థాయికి ఎదిగారుట‌. పెళ్లి చేసుకున్న త‌ర్వాత వారంతా కూడా ఆ బంగ్లా ద‌గ్గ‌ర‌లోనే ఇళ్లు తీసుకుని కాపురాలు పెట్టారుట‌. ఆ బంగ్లా లో ఉన్న లేడీ ఆర్టిస్టులు కూడా అప్ప‌ట్లో ఓ స్థాయికి చేరు కున్న వారే. వాళ్ల జ‌న‌రేష‌న్ త‌ర్వాత చిరంజీవి కూడా అదే బంగ్లాలో చాలా కాలం పాటు ఉండి సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించారు. చిరంజీవితో పాటు ఆయ‌న స్నేహితులు కూడా అందులో ఉండేవారు. అలా ఆ బంగ్లా ఎంతో మంది కి షెల్ట‌ర్ ఇచ్చి స్టార్ల‌గా మార్చింద‌`న్నారు.