Begin typing your search above and press return to search.

మ‌లైకా X అర్జున్: బెక్‌హామ్‌తో పార్టీలో బ్రేక‌ప్ పుకార్ల‌కు చెక్

అయితే ఈ పుకార్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెట్టేందుకు అవ‌కాశం ఉన్న వేదిక‌ల‌ను ఉప‌యోగించుకుంటోంది ఈ అంద‌మైన జంట‌.

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:26 PM GMT
మ‌లైకా X అర్జున్: బెక్‌హామ్‌తో పార్టీలో బ్రేక‌ప్ పుకార్ల‌కు చెక్
X

ఆ ఇద్ద‌రూ క‌లిసే ఉన్నారా? లేక విడిపోయారా? గ‌త కొంత‌కాలంగా నెటిజ‌నుల్లో సాగుతున్న బిగ్ డిబేట్ ఇది. ఆ ఇద్ద‌రూ ఎవ‌రు? అంటే బాలీవుడ్ హాటెస్ట్ పెయిర్ మ‌లైకా అరోరా- అర్జున్ క‌పూర్. ఈ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల క‌లిసి క‌నిపించ‌డం లేదు.. ఈ జంట న‌డుమ‌ ఏదో అయింది! అంటూ కొద్దిరోజులుగా సోష‌ల్ మీడియాల‌లో చ‌ర్చ సాగుతోంది. అయితే ఈ పుకార్ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెట్టేందుకు అవ‌కాశం ఉన్న వేదిక‌ల‌ను ఉప‌యోగించుకుంటోంది ఈ అంద‌మైన జంట‌.


ఇప్పుడు స్టార్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ డేవిడ్ బెక్ హామ్ తో పార్టీలో తాము క‌లిసే ఉన్నామ‌ని హింట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. బ్రేక‌ప్ వార్త‌లకు బెక్ హాం పార్టీలో చెక్ పెట్టారు. మలైకా అరోరా - అర్జున్ కపూర్ స్ట‌న్నింగ్ పెయిర్ బెక్‌హామ్‌తో పోజులిస్తూ బ్రేకప్ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.


దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడికి సోనమ్ కపూర్ - ఆనంద్ అహూజా వారి నివాసంలో సాదరంగా స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి బాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. షాహిద్ కపూర్ - మీరా రాజ్ పుత్, అనీల్ క‌పూర్, కరిష్మా కపూర్ స‌హా పలువురు స్టార్లు హాజరయ్యారు.


దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ యునిసెఫ్‌ గ్లోబల్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇండియాలో ప్రస్తుతం ఒక స‌కార్యం కోసం ఉన్నాడు. అదే స‌మ‌యంలో టీమిండియా-న్యూజిలాండ్ మ్యాచ్ ని వీక్షించాడు. అతడు ముంబై పర్యటనలో సోనమ్ - ఆనంద్‌లను కూడా కలిశాడు. పవర్ క‌పుల్ (సోనమ్- ఆనంద్) పార్టీలో అత‌డు ప్ర‌త్యేక అతిథిగా మెరిసాడు. ఈ వేడుక‌లోనే మలైకా- అర్జున్ లెజెండ‌రీ ఆటగాడితో పోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు వైర‌ల్ గా మారుతున్నాయి. మ‌లైకా ఎప్ప‌టిలానే ఈ పార్టీలోనూ టూ హాట్ గా క‌నిపించింది.


బెక్ హామ్ తో స‌న్నిహిత ఫోటోల‌ను షేర్ చేస్తూ మలైకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది- ``గుర్తుంచుకోవడానికి ఒక అంద‌మైన‌ రాత్రి... చాలా సంవత్సరాలుగా దూరం నుండి చూస్తూ అత‌డి ఆట‌ను మెచ్చుకున్న మ‌నం .. ఇప్పుడు అత‌డికి చేరువ‌గా... ఇండియాకి వ‌చ్చిన అత‌డి కొత్త జీవితం గురించి అతనితో ముఖాముఖి మాట్లాడగలిగాము. డేవిడ్ పిల్లలు, దాతృత్వం & మిగతావన్నీ నేను 15 నిమిషాల డిన్నర్‌లో అడిగి తెలుసుకోగ‌లిగాను`` అని మ‌లైకా రాసారు. బెక్ హామ్ నుంచి మ‌లైకా చాలా విష‌యాల‌ను రాబ‌ట్టింది. ముఖ్యంగా తన ప్రియుడితో బ్రేక‌ప్ వార్త‌లు నిజం కాద‌ని ప్రూవ్ చేసింది.