Begin typing your search above and press return to search.

సమంత కుక్కపిల్ల చైతన్యతో.. ఎందుకంటే?

అయితే తాజాగా హష్ ని పోలిన కుక్కపిల్ల నాగచైతన్య దగ్గర కనిపించింది. ఓ అభిమాని తాను కొన్న స్పోర్ట్స్ బైక్ ని నాగచైతన్యకి చూపించడానికి తీసుకెళ్ళాడు.

By:  Tupaki Desk   |   3 Oct 2023 10:39 AM GMT
సమంత కుక్కపిల్ల చైతన్యతో.. ఎందుకంటే?
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్ళైన నాలుగేళ్ళకే ఇద్దరు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఇప్పుడు ఎవరి లైఫ్ వారు సింగిల్ గా లీడ్ చేస్తున్నారు. సమంతకి కుక్కలంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు హష్ అనే ఒక కుక్కని పెంచుకున్నారు. ఆ కుక్కపిల్ల నిత్యం వారితోనే ఉండేది.

సమంతకి హష్ అంటే చాలా ఇష్టం అందుకే విడాకుల తర్వాత ఆ కుక్కపిల్లని సమంత తనంతోపాటే తీసుకొని వెళ్ళిపోయింది. నాగ చైతన్యకి కూడా హష్ కుక్క అంటే ప్రత్యేకమైన అభిమానమే. తాను పెంచుకున్న పెట్స్ అన్ని కూడా సమంతతో తనతో తెచ్చేసుకుంది. అప్పుడప్పుడు తన పెంపుడు కుక్కలతో ఫోటోలు దిగుతూ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా హష్ ని పోలిన కుక్కపిల్ల నాగచైతన్య దగ్గర కనిపించింది. ఓ అభిమాని తాను కొన్న స్పోర్ట్స్ బైక్ ని నాగచైతన్యకి చూపించడానికి తీసుకెళ్ళాడు. అక్కడ చైతూ ఆ బైక్ ని టెస్ట్ డ్రైవ్ కూడా చేశాడు. ఆ సమయంలో చైతూతోపాటే హుష్ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం. సమంత పెట్ చైతూ దగ్గరకి ఎలా వచ్చింది అనే ప్రశ్నలు నెటిజన్లు నుంచి వస్తున్నాయి.

కొంతమంది అయితే అడుగు ముందుకేసి మరల ఇద్దరు కాలుస్తున్నారా అనే డౌట్స్ కూడా అడిగారు. అయితే సమంత ప్రస్తుతం వెకేషన్స్ లో ఉంది. దాంతోపాటు కాస్తా అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ సమయంలో హష్ ని నాగ చైతన్య దగ్గరకి పంపించి ఉంటుందని భావిస్తున్నారు. హష్ సమంత, చైతన్య దగ్గర మాత్రమే ఉంటుంది.

ఈ కారణంగా సమంత అనారోగ్యం దృష్ట్యా హష్ ని చైతూకి అప్పగించి ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అలా కాకుండా అభిమానులు కోరుకుంటున్నట్లు ఇద్దరినీ ఆ హష్ ఒకటి చేస్తే అక్కినేని అభిమానులు కూడా సంతోషిస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.