Begin typing your search above and press return to search.

నాగ‌చైత‌న్య‌-శోభిత త్వ‌ర‌లో ఓపెన‌వుతారంటూ..!

తాజా స‌మాచారం మేర‌కు.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా డేటింగ్ నిజం. త్వ‌ర‌లోనే దీనిపై ఓపెన్ కాబోతున్నారంటూ ప్ర‌ఖ్యాత "ఇండియా టుడే" క‌థ‌నం వెలువ‌రించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   18 Sep 2023 12:28 PM GMT
నాగ‌చైత‌న్య‌-శోభిత త్వ‌ర‌లో ఓపెన‌వుతారంటూ..!
X

తెలుగ‌మ్మాయి శోభిత‌తో అక్కినేని నాగ‌చైత‌న్య డేటింగ్ గురించి చాలా కాలంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ చెఫ్ సురేంద‌ర్ చై-శోభిత క‌లిసి రెస్టారెంట్ కి వెళ్లిన ఫోటోని అనాలోచితంగా లీక్ చేసిన క్ర‌మంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రుగుతోంద‌ని అంతా భావించారు. కానీ ఆ త‌ర్వాత శోభిత దీనిపై సీరియ‌స్ అయింది. తాజా స‌మాచారం మేర‌కు.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా డేటింగ్ నిజం. త్వ‌ర‌లోనే దీనిపై ఓపెన్ కాబోతున్నారంటూ ప్ర‌ఖ్యాత "ఇండియా టుడే" క‌థ‌నం వెలువ‌రించ‌డం హాట్ టాపిక్ గా మారింది. "చైత‌న్య‌ ఇప్పటికీ శోభితతో డేటింగ్ చేస్తున్నాడు. వారు స్ట్రాంగ్ రిలేష‌న్‌లో ఉన్నారు" అని ఒక సోర్స్ చెబుతోందంటూ స‌ద‌రు క‌థ‌నం ఉటంకించింది.

నిజానికి నాగ చైతన్య - శోభిత ధూళిపాళ డేటింగ్ పుకార్లు ఇప్పుడే కొత్త కాదు. ఈ జంటకు సన్నిహితులు ఒక‌రు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ఈ జంట‌ తమ రిలేష‌న్‌షిప్‌ని త్వరలో బహిరంగపరచాలనే ఆలోచనపై చర్చిస్తున్నారు. సీరియ‌స్‌గా పరిశీలిస్తున్నారు" అని ఈ క‌థ‌నంలో పేర్కొన్నారు. అంతేకాదు నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకుంటార‌న్న పుకార్లను కూడా ఈ సోర్స్ ఖండించింది. చైతూ ఒక వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్నట్లు చాలా మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి. ఈ వార్తలను తోసిపుచ్చుతూ చైత‌న్య‌ సినిమాయేతర వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకుంటాడనే పుకార్లలో నిజం లేదని సోర్స్ వెల్ల‌డించింది. అతడు ఇప్పటికీ శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడు. వారి బంధం బలంగా ఉంది. ఈ జంట తమ రిలేష‌న్‌ను త్వరలో బహిరంగపరచాలని భావిస్తున్నారు. తమ ప్రేమను బహిరంగంగా అంగీకరించడానికి వారు సిగ్గుపడరు" అని తెలిపింది.

నాగ చైతన్య, శోభితా ధూళిపాళల రిలేషన్ షిప్ గురించి గత ఏడాది రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరి ఫోటోలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఆగస్ట్ 2022లో RJ సిద్ధార్థ్ కన్నన్ ఒక ఇంటర్వ్యూలో శోభిత గురించి వివరించమని నాగ చైతన్యను అడిగారు. "నేను నవ్వుతాను" అని అత‌డు వ్యాఖ్యానించాడు. అటుపై కొన్ని నెలలకు వారి స్నేహానికి సంబంధించిన‌ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డం సంచ‌ల‌న‌మైంది.

ఈ ఏడాది మార్చిలో చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఈ నేపథ్యంలో టేబుల్ వద్ద కూర్చున్న శోభితా ధూళిపాళను అభిమానులు వెంటనే గుర్తించారు. మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా రిలేషన్ షిప్ పుకార్లను ప్రస్తావించిన‌ శోభితా ధూళిపాళ దీనిపై కొంత సీరియ‌స్ అయ్యారు. "తెలివి లేకుండా మాట్లాడే వ్యక్తుల కు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. నేను ఏ తప్పు చేయనప్పుడు.. అది నా వ్య‌వ‌హారం కానప్పుడు దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌నే ఆలోచ‌న కోరిక నాకు లేవు. ఎవ‌రైనా సగం జ్ఞానంతో రాసే విషయాల గురించి సమాధానం ఇవ్వడానికి లేదా స్పష్టం చేయడానికి బదులుగా, ఎవ‌రికి వారు వారి జీవితంపై దృష్టి పెట్టాలి. మిమ్మ‌ల్ని మీరు మెరుగుప‌రుచుకోండి. ప్రశాంతంగా ఉండండి.. మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించండి" అని అన్నారు.

నాగ చైతన్య గతంలో సమంత రూత్ ప్రభుని వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్ళ దాంపత్య జీవితం తర్వాత ఈ జంట‌ విడిపోయారు. ఇద్దరూ విడిపోతున్నట్లు అక్టోబర్ 2021లో సోషల్ మీడియాలో సంయుక్తంగా ప్రకటించారు. నాగ చైతన్య - సమంత జంట గ‌తంలో మనం, ఏ మాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు.