Begin typing your search above and press return to search.

నాగచైతన్య దూత ఆగమనం.. గెట్ రెడీ!

ఈ వెబ్ సీరీస్ ను విడుదల చేసినందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో సిద్దమయింది. ధూత, ఒక సూపర్ నేచురల్ సస్పెన్స్-థ్రిల్లర్ గా రానుంది.

By:  Tupaki Desk   |   15 Nov 2023 7:36 AM GMT
నాగచైతన్య దూత ఆగమనం.. గెట్ రెడీ!
X

అక్కినేని నాగచైతన్య మొదటి సారి దూత వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ వరల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. మనం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఎంతో కాలంగా అక్కినేని ఫ్యాన్స్ ను ఊరిస్తోంది. అసలైతే కొన్ని నెలల క్రితమే ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయాలని అనుకున్నారు.


కానీ అప్పటికి నాగచైతన్య మిగతా సినిమాలతో బిజీగా ఉండడంతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. గోడలో పెడుతూ వచ్చారు. ఇక మొత్తానికి ఇప్పుడు సరైన సమయంలో ఈ వెబ్ సీరీస్ ను విడుదల చేసినందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో సిద్దమయింది. ధూత, ఒక సూపర్ నేచురల్ సస్పెన్స్-థ్రిల్లర్ గా రానుంది.

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్టు ను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించారు. దూత లో నాగచైతన్య జర్నలిస్ట్ సాగర్ పాత్రలో కనిపించనున్నాడు. అతను పలు రహస్యమైన, భయంకరమైన మరణాల మిస్టరీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక నాగ చైతన్య తన కెరీర్ లొనే మొదటిసారి ఇలాంటి థ్రిల్లర్ సినిమాలో నటించాడు.

ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్‌గా రానున్న దూత లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, మరియు ప్రాచీ దేశాయ్ కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లర్ డ్రామాగా రానున్న ఈ వెబ్ సీరీస్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాలలో డిసెంబర్ 1న స్ట్రీమింగ్ కానుంది. ఇక నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ తో ఎలాగైనా మంచి రిజల్ట్ అందుకోవాలి అనుకుంటున్నాడు.

ఎందుకంటే ఇటీవల కాలంలో అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కావడం లేదు. కాబట్టి ఈ వెబ్ సిరీస్ తోనే మళ్లీ సక్సెస్ అందుకుని ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఇక దూత వెబ్ సిరీస్ పై కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఇలాంటి కథలను చాలా బాగా హ్యాండిల్ చేయగలడు అని మొదటి సినిమా 13B తోనే క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఈ సినిమా మంచి ఫలితం అందుకుంటుంది అని నాగ చైతన్య ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు.