Begin typing your search above and press return to search.

చైతూతో కలవడం కుదరదా.. ఇది సామ్ సమాధానమే?

తాజాగా కూడా కొన్ని పిక్స్​ను షేర్ చేసింది. అందులో ఆమె పింక్ కలర్ శారీలో దర్శనమిచ్చింది. అయితే ఈ ఫొటోలో సమంత అందాలతో పాటు నెటిజెన్స్ మరొకటి కూడా గమనించారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 11:02 AM GMT
చైతూతో కలవడం కుదరదా.. ఇది సామ్ సమాధానమే?
X

అక్కినేని హీరో నాగ చైతన్య - స్టార్ హీరోయిన్ సమంత.. విడిపోయి చాలా కాలం అయిందన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ జంట దగ్గర హాష్​ అనే పెంపుడు కుక్క ఉండేది. నాగచైతన్యతో విడిపోయాక సమంత ఆ పెట్​ను తనతో తీసుకెళ్లారు. అయితే, ఇటీవల సమంత విదేశాలకు వెళ్లాక.. హాష్​ చైతూ దగ్గర ఉండటం చూసి.. ఈ జంట మళ్లీ కలిసిపోనున్నారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు అందులో వాస్తవం లేదని తాజాగా తేలింది.

వివరాళ్లోకి వెళితే.. సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసిటిస్ చికిత్స, మనశ్శాంతి కోసం విదేశాలు వెళ్ళింది. అక్కడి ప్రదేశాలను తిరిగేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడ దిగిన ఫొటోలనూ సోషల్​ మీడియాలో షేర్ చేస్తోంది.

తాజాగా కూడా కొన్ని పిక్స్​ను షేర్ చేసింది. అందులో ఆమె పింక్ కలర్ శారీలో దర్శనమిచ్చింది. అయితే ఈ ఫొటోలో సమంత అందాలతో పాటు నెటిజెన్స్ మరొకటి కూడా గమనించారు. అదేంటంటే.. సమంత పక్కటెముకుల మీద ఉండాల్సిన చైతూ పేరు టాటూ ఇప్పుడు కనిపించడం లేదు.

చైతూ ఆనవాళ్లు తన ఒంటి మీద లేకుండా చెరిపేసుకుంది. ప్రస్తుతం చై టాటూను సామ్ తొలగించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజెన్స్ ఆ టాటూ ఏమైందని తెగ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య పేరుని సమంత పూర్తిగా తొలిగించిందా..? లేదా సినిమాల్లో కవర్ చేసినట్లు ఈ ఫోటోషూట్​లో కూడా కవర్ చేసిందా..? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి అభిమానులు ఆశించినట్టుగా సమంత - చైతూ కలుస్తారా లేదంటే విడి విడిగానే ఉంటారా అనేది.. కాగా, సామ్ రీసెంట్​గా విజయ్​ దేవరకొండతో 'ఖుషి' సినిమాలో నటించింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద పర్వాలైదనిపించే టాక్​ అందుకుంది. త్వరలోనే సిటాడెల్​ ఇండియన్ వెర్షన్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. దీంతో హిందీలో సల్మాన్ ఖాన్​తో ఓ సినిమా చేయనుందని అంటున్నారు.