Begin typing your search above and press return to search.

'హనుమాన్' పై నాగచైతన్య రివ్యూ.. వారు హైలెట్ అంటూ..

తాజాగా ఈ లిస్టులో అక్కినేని నాగచైతన్య కూడా చేరిపోయాడు. నిన్న రాత్రి ఈ సినిమాను చూసిన నాగచైతన్య ట్విట్టర్ వేదికగా సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 8:21 AM GMT
హనుమాన్ పై నాగచైతన్య రివ్యూ.. వారు హైలెట్ అంటూ..
X

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హనుమాన్' ఆడియన్స్ నుంచి బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఇండియన్‌ బాక్సాఫీస్ ని షేక్‌ చేస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే వరల్డ్‌ వైడ్‌గా రూ.150 కోట్లు వసూళ్లు చేసింది. ఎప్పుడో బ్రేక్‌ ఈవెన్‌ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని, విజువల్స్‌ అయితే నెక్ట్స్‌ లెవల్‌ లో ఉన్నాయని అంటున్నారు ప్రేక్షకులు. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే హనుమాన్ కంటెంట్ కింగ్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ సౌత్ నార్త్ అనే తేడా లేకుండా భారీ ప్రేక్షకాదరణను దక్కించుకుంటుంది. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు సినీ ప్రముఖులు సైతం హనుమాన్ సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా ఈ లిస్టులో అక్కినేని నాగచైతన్య కూడా చేరిపోయాడు. నిన్న రాత్రి ఈ సినిమాను చూసిన నాగచైతన్య ట్విట్టర్ వేదికగా సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ మేరకు చైతు ట్వీట్ చేస్తూ.." హనుమాన్ చిత్రం బ్లాక్ బాస్టర్ సాధించినందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి కంగ్రాచులేషన్స్. హనుమాన్ రైటింగ్ లో కొత్త తరం ఆలోచనలు, సరికొత్త కాన్సెప్ట్ కనిపించాయి. సినిమా మొత్తం గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి.

తేజ సజ్జ అమేజింగ్ పర్ఫామెన్స్ తో కన్విన్స్ చేసే విధంగా నటించాడు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్ లతో పాటూ మూవీ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో చైతు చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కాగా చైతు కంటే ముందు మొన్న సమంత కూడా హనుమాన్ సినిమా చూసి రియాక్ట్ అయింది.

" హనుమాన్ సినిమాను బిగ్ బిగ్ స్క్రీన్ పై చూడడం అద్భుతంగా ఉందని, ప్రశాంత్ వర్మ కు థాంక్స్ చెప్తూ.. నీ యూనివర్స్ లో తర్వాతి చాప్టర్స్ ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. తేజ సజ్జా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ.. తేజ నన్ను సర్ప్రైజ్ చేసావు. నీ కామెడీ టైమింగ్, అమాయకత్వం, హనుమంతుడిగా నీ ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ సినిమాకు ప్రాణం పోశాయి" అంటూ మూవీ టీం మొత్తానికి కంగ్రాట్స్ తెలిపింది.