Begin typing your search above and press return to search.

ఖుషి ట్రైలర్.. నాగచైతన్య షాకింగ్ రియాక్షన్

అందులో వాస్తవం లేదు అన్నట్లుగానే నాగచైతన్య మాట్లాడారు. రీసెంట్ గ్ నాపై కొన్ని వార్తలు అవస్తవంగా ప్రచారం చేశారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 3:27 PM GMT
ఖుషి ట్రైలర్.. నాగచైతన్య షాకింగ్ రియాక్షన్
X

సమంత నాగచైతన్య భార్యాభర్తలుగా విడిపోయినప్పటి నుంచి కూడా వారికి సంబంధించిన అనేక రకాలు వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక వారి సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు గత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎక్కడో ఒక చోట ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఇద్దరు కూడా చాలా సున్నితంగానే రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ముఖ్యంగా నాగచైతన్య ఎక్కడ కాంట్రవర్సీకి చోటు ఇవ్వకుండా సమంత జీవితం బాగుండాలి అనే విధంగా సమాధానాలు అయితే ఇస్తున్నాడు. ఇక నాగచైతన్యకు సంబంధించిన మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సెప్టెంబర్ 1వ తేదీన సమంత విజయ్ దేవరకొండ తో నటించిన ఖుషి సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

అయితే ఈ సినిమా ట్రైలర్ ను ప్రదర్శించగానే నాగచైతన్య బయటకు వెళ్లిపోయాడు అన్నట్లుగా యూట్యూబ్లో కూడా ఇప్పుడు కథనాలు అయితే వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య రీసెంట్ గా ఒక సినిమా చూడడానికి వెళ్ళగా అక్కడ ఖుషి సినిమాకు సంబంధించిన ట్రైలర్ను ప్రదర్శించారట. అయితే దాన్ని చూడగానే నాగచైతన్య సైలెంట్ గా థియేటర్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అని ఆ తర్వాత సినిమా కూడా చూడలేదు అన్నట్లుగా సోషల్ మీడియాలో ఇతర వెబ్ సైట్స్ లలో వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఈ విషయంలో ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందులో వాస్తవం లేదు అన్నట్లుగానే నాగచైతన్య మాట్లాడారు. రీసెంట్ గ్ నాపై కొన్ని వార్తలు అవస్తవంగా ప్రచారం చేశారు. అయితే అలా ప్రచారం చేసిన కొన్ని వెబ్ మీడియా వారికి కూడా నేను ప్రత్యేకంగా క్లారిటీ ఇచ్చాను.

అందులో ఎలాంటి నిజం లేదు అని ఇలాంటి వార్తలు ప్రచారం చేయకూడదు అని నాగచైతన్య సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడట. ఇక ప్రస్తుతం నాగచైతన్య చందు మండేటి దర్శకత్వంలో ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా బన్నీవాసు నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.