Begin typing your search above and press return to search.

నాగ చైతన్య 'దూత' కోసం ఎక్కువగా...!

ఆ సమయంలో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. దూత వెబ్‌ సిరీస్ లో తన పాత్ర తప్పకుండా అలరించే విధంగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   27 Nov 2023 11:30 PM GMT
నాగ చైతన్య దూత కోసం ఎక్కువగా...!
X

ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు సమాంతరంగా వెబ్‌ సిరీస్‌ లకు కూడా క్రేజ్ పెరుగుతోంది. స్టార్స్ నటించే సినిమాలకు థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందో, స్టార్‌ హీరోలు నటించిన వెబ్‌ సిరీస్‌ లకు ఓటీటీ ల్లో కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తోంది. తమ హీరోలోని పూర్తి స్థాయి నటన ప్రతిభ చూసేందుకు వెబ్‌ సిరీస్‌ లు చక్కగా ఉపయోగపడుతున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌ నుంచి ఇప్పటికే కొందరు వెబ్‌ సిరీస్ ల్లో ఎంట్రీ ఇచ్చారు. తాజాగా నాగ చైతన్య కూడా దూత అనే వెబ్‌ సిరీస్‌ తో ఓటీటీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. విక్రమ్‌ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ప్రేక్షకులు దాదాపుగా ఏడాది కాలంగా వెయిట్‌ చేస్తున్నారు. కారణం ఏంటో కానీ ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ ను ప్రైమ్‌ వీడియో చాలా ఆలస్యం చేసింది.

ఇక దూత గురించి జనాలు మర్చిపోతున్నారు. ఆ సిరీస్ రాదేమో అనుకుంటూ ఉన్న సమయంలో అమెజాన్‌ ప్రైమ్‌ వారు డిసెంబర్‌ 1న దూత ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. గోవాలో జరుగుతున్న ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఈ సిరీస్‌ యొక్క మొదటి ఎపిసోడ్‌ ను ప్రదర్శించడం జరిగింది. మంచి స్పందన దక్కిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఆ కార్యక్రమంలో హీరో చైతూ మరియు దర్శకుడు విక్రమ్ పాల్గొన్నారు. ఆ సమయంలో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. దూత వెబ్‌ సిరీస్ లో తన పాత్ర తప్పకుండా అలరించే విధంగా ఉంటుంది. దూత అంటే మెసెంజర్‌. తాను ఒక జర్నలిస్ట్‌ గా కనిపించబోతున్నారు. కథ రీత్యా షూటింగ్ ను ఎక్కువగా వర్షంలోనే చేశామని నాగ చైతన్య అన్నాడు.

ముందు ముందు కూడా తన నుంచి తప్పకుండా వెబ్‌ సిరీస్ లు వస్తాయని చైతూ ప్రకటించాడు. మంచి కథలు మరియు మంచి దర్శకులు వస్తే వెబ్‌ సిరీస్ లు కంటిన్యూగా చేస్తానంటూ నాగ చైతన్య చెప్పడంతో ఓటీటీ ప్రేక్షకులకు ఆనందం కలుగుతుంది.