Begin typing your search above and press return to search.

నాగ చైతన్య చందు మొండేటి టార్గెట్ పెద్దదే..?

గీతా ఆర్ట్స్ ఈ సినిమా కోసం 100 కోట్ల దాకా బడ్జెట్ పెడుతుందని తెలుస్తుంది. నాగ చైతన్య కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 4:30 PM GMT
నాగ చైతన్య చందు మొండేటి టార్గెట్ పెద్దదే..?
X

అక్కినేని నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా చందు మొండేటితో ఫిక్స్ చేసున్నారని తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. గుజరాతీ కథను ఆధారం చేసుకుని చందు ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఆల్రెడీ శ్రీకాకులం వెళ్లి అక్కడ లొకేషన్స్ చూసి వచ్చిన మేకర్స్ సినిమా షెడ్యూల్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారట. అంతేకాదు వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా కోసం నాగ చైతన్య గడ్డం లుక్ కూడా సిద్ధమైంది. రీసెంట్ గా రెండు మూడు ఫంక్షన్స్ లో నాగ చైతన్య గడ్డం లుక్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమా కోసం 100 కోట్ల దాకా బడ్జెట్ పెడుతుందని తెలుస్తుంది. నాగ చైతన్య కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. కంటెంట్ బాగుంటే హీరో రేంజ్ ని మించి బడ్జెట్ పెట్టినా పర్లేదని కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. అందుకే కథ మీద నమ్మకంతో అంత బడ్జెట్ వేశారట.

నాగ చైతన్య చందు మొండేటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాకు కాస్ట్ అండ్ క్రూ విషయంలో కూడా రాజీ పడట్లేదని తెలుస్తుంది. సినిమాలో నాగ చైతన్య సరసన జోడీగా సాయి పల్లవిని ఫిక్స్ చేశారు. ఆల్రెడీ లవ్ స్టోరీతో ఈ జోడీ హిట్ అందుకుంది. ఇక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ని ఫైనల్ చేశారట. పుష్ప తో పాన్ ఇండియాని షేక్ చేసిన దేవి ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతాడు. సినిమాటోగ్రాఫర్ గా మధీని తీసుకోవాలని చూస్తున్నారు. అతను ఓకే కాకపోతే మరో స్టార్ సినిమాటోగ్రాఫర్ ని తీసుకుంటారని టాక్.

మొత్తానికి చైతన్యతో కలిసి చందు మొండేటి పెద్ద టార్గెట్ ని పెట్టుకున్నాడని తెలుస్తుంది. సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలతో హిట్ అందుకున్న చందు నాగ చైతన్యతో చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. త్వరలో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టనున్న ఈ సినిమా 2024 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది.