Begin typing your search above and press return to search.

చౌర్య పాఠం టీజర్.. ఓ బ్యాంకు దోపిడీ

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మూవీ ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇప్పుడు నిర్మాతగా మారారు

By:  Tupaki Desk   |   10 Feb 2024 9:12 AM GMT
చౌర్య పాఠం టీజర్.. ఓ బ్యాంకు దోపిడీ
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మూవీ ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇప్పుడు నిర్మాతగా మారారు. యంగ్ హీరో ఇంద్ర రామ్ కథానాయకుడిగా చౌర్య పాఠం మూవీని తెరకెక్కిస్తున్నారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్‌ పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.


తాజాగా మేకర్స్.. ఈ సినిమా ప్రమోషన్లను ప్రారంభించారు. క్రైమ్ కమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న చౌర్య పాఠం మూవీ ఫస్ట్ లుక్ తోపాటు టీజర్ ను రిలీజ్ చేశారు. కామెడీ, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో సాగిన టీజర్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఒక నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

హీరో ఇంద్ర రామ్.. గ్రామంలోని ఓ బ్యాంకు దోపిడీకి తన ముఠాను సిద్ధం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. హీరో తన టీమ్ కు నాలుగు ముఖ్యమైన విషయాలను చెప్తాడు. 1. తామంతా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ అని గ్రామస్థులను నమ్మించేలా చేయాలి 2. వాకీ-టాకీ ద్వారా మాత్రమే కమ్యునికేట్ అవ్వాలి 3. కోడ్ భాషలో మాత్రమే మాట్లాడాలి. 4 వారి దాచిన ఆయుధాలు వారికి మాత్రమే కనిపించాలి. వీరంతా తమ ప్లాన్ ఎలా అమలు చేస్తారన్నదే మిగతా సినిమా.

సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించగా, నిఖిల్ గొల్లమారి ఎంటర్టైనింగ్ గా రూపొందించినట్లు తెలుస్తోంది. నటీనటుల క్యారెక్టర్ డిజైనింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. కూల్‌ అండ్ స్టైలిష్‌ గా కనిపించే ఇంద్ర రామ్ తన కామెడీ టైమింగ్‌ తో ఆకట్టుకున్నారు. హీరో ఫ్రెండ్స్.. తమ అమాయక చర్యలతో కామెడీ పండిస్తున్నారు. టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా బాగున్నాయని నెటిజన్లు చెబుతున్నారు.

కార్తీక్ ఘట్టమనేని కెమెరా టేకింగ్ ఎప్పటిలాగే సూపర్ గా ఉండగా, ఈగల్ ఫేమ్ దావ్‌జాంద్ తన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ తో ఫన్ టచ్ ఇచ్చారు. ఇక పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటించగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, అంజి వల్గుమాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్. వి.ఎస్.ఎస్. సురేష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.