Begin typing your search above and press return to search.

93 ఏళ్ల వయసులోనూ అవే పాత్రలు

యూనివర్శిల్‌ స్టార్ కమల్‌ హాసన్ సోదరుడు చారు హాసన్‌ వయసు 93 ఏళ్లు

By:  Tupaki Desk   |   2 Aug 2023 1:06 PM GMT
93 ఏళ్ల వయసులోనూ అవే పాత్రలు
X

యూనివర్శిల్‌ స్టార్ కమల్‌ హాసన్ సోదరుడు చారు హాసన్‌ వయసు 93 ఏళ్లు. ఈయన సౌత్‌ ఇండియన్ సినీ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. చారు హాసన్‌ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించారు. ఇప్పటికి కూడా నటిస్తున్నారు.

వయసు మీద పడటంతో చిన్న చితక సినిమాల్లో పాత్రల్లో నటిస్తున్నాడు అనుకుంటే పొరపాటే. ఈ వయసులోనూ ఈయన లీడ్ రోల్స్ చేయడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తోంది. తాజాగా ఈ తాతగారు దాదా 87 అనే సినిమాలో నటించాడు. ఆ సినిమాలో మంచి పాత్ర తో మెప్పించాడు.

దాదా 87 సినిమా దర్శకుడు ప్రస్తుతం మరో సినిమాను రూపొందిస్తున్నాడు. ఆ సినిమాలో చారు హాసన్‌ ఏకంగా మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్‌ టచ్‌ అనే విషయాలను చూపించే కథతో ఈ సినిమా ని రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు విజయ్ శ్రీ జి పేర్కొన్నారు.

ఈ సినిమాలో సురేష్ మీనన్‌, వనిత విజయ్‌ కుమార్‌, కుష్బు, యోగి బాబు వంటి ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వంద ఏళ్లకు సమీపిస్తున్న చారు హాసన్‌ ఇప్పుడు డాన్‌ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.