Begin typing your search above and press return to search.

ఛార్మీ షాకింగ్ పోస్ట్.. అన్నీ గ్రాముల్లో కొలిచి మరీ..

చార్మీ, పూరి జగన్నాథ్ కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌ పై కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు రీసెంట్ గా అనౌన్స్మెంట్ వచ్చింది.

By:  Tupaki Desk   |   16 April 2025 11:40 PM IST
ఛార్మీ షాకింగ్ పోస్ట్.. అన్నీ గ్రాముల్లో కొలిచి మరీ..
X

నటి, నిర్మాత ఛార్మీ కౌర్ గురించి అందరికీ తెలిసిందే. అందం, అభినయంతో మంచి ఫ్యాన్ బేస్ ఆమె సొంతం. నీతోడు కావాలి అంటూ టాలీవుడ్ కు పరిచయమైన ఛార్మీ.. శ్రీ ఆంజనీయం మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుందని చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై వరుస అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది అమ్మడు.

పౌర్ణమి, మంత్ర, చక్రం, మాస్, చంటి, గౌరి, రాఖీ, స్టైల్, కౌసల్య సుప్రజ రామా, మంగళ, జ్యోతి లక్ష్మి, మంత్ర 2 వంటి వివిధ సినిమాల్లో నటించిన ఛార్మి.. పదేళ్ల క్రితం యాక్టింగ్ కు గుడ్ బై చెప్పిసేంది. ఆ తర్వాత నిర్మాతగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డేషింగ్ పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై సినిమాలు తీస్తోంది.

అయితే ఛార్మీ నిర్మాతగా ఇటీవల వరుస ఫ్లాపులు చవిచూసిందనే చెప్పాలి. స్టార్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా మారింది. దీంతో భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రామ్ డబుల్ ఇస్మార్ట్ కూడా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు విజయ్ సేతుపతితో సినిమా చేస్తోంది.

చార్మీ, పూరి జగన్నాథ్ కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌ పై కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు రీసెంట్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో తాజాగా ఛార్మీ పెట్టిన ఇంట్రెస్టింగ్ పోస్ట్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.

"నా జీవితం పోర్షన్ కంట్రోల్‌ గా మారింది. నా ఉద్దేశ్యం మీకు తెలిస్తే? కొన్ని తగ్గాయి, మరికొన్ని వెళ్లాయని అర్థం అవుతుంది" అంటూ క్యాప్షన్ ఇస్తూ తాను డైట్ ఫాలో అవుతున్నట్లు తెలిపింది. ఫుడ్ ను గ్రాముల్లో తీసుకుంటున్నట్లు చెప్పింది. 114 గ్రాముల చేప, 52 గ్రాముల ఇడ్లీ, 100 గ్రాముల అన్నం అంటూ పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.

దీంతో నెటిజన్లు ఫుల్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఏంటి మేడమ్ ఛేంజ్ అని క్వశ్చన్ చేస్తున్నారు. ఛార్మి ఫోటో అదిరిపోయిందని చెబుతున్నారు. బ్లాక్ డ్రెస్ లో గోర్జియస్ గా ఉన్నారని కొనియాడుతున్నారు. ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.