Begin typing your search above and press return to search.

వీడియో : మ‌హేష్ మేన‌ల్లుడు చ‌రిత్ మాన‌స్ ప్యూచ‌ర్ స్టార్!

సూప‌ర్ స్టార్ మేహేష్ మేన‌ల్లుడు..న‌టుడు సుధీర్ బాబు త‌న‌యుడు చ‌రిత్ మాన‌స్ తెరంగేట్రానికి ముందే సంచ‌ల‌నమ‌వుతున్నాడు.

By:  Tupaki Desk   |   23 Dec 2023 10:33 AM GMT
వీడియో : మ‌హేష్ మేన‌ల్లుడు చ‌రిత్ మాన‌స్  ప్యూచ‌ర్ స్టార్!
X

సూప‌ర్ స్టార్ మేహేష్ మేన‌ల్లుడు..న‌టుడు సుధీర్ బాబు త‌న‌యుడు చ‌రిత్ మాన‌స్ తెరంగేట్రానికి ముందే సంచ‌ల‌నమ‌వుతున్నాడు. ఇప్ప‌టికే అచ్చుగుద్దిన మేన‌మామ పోలిక‌ల‌తో చ‌రిత్ సగం స‌క్సస్ అయిపోయాడు. మ‌హేష్ లానే వాకింగ్ స్టైల్...ర‌న్నింగ్ స్టైల్... ఫేస్ లో ఎక్స్ ప్రెషెన్స్ ప్ర‌తీది మామ‌ని దించేసాడు. ఆవీడియో లు నెట్టింట ఎంత‌లా వైర‌ల్ అయ్యాయో తెలిసిందే. తొలుత ఈ కుర్రాడు ఎవ‌రో? తెలియ కుండానే అచ్చం మ‌హేష్ లా ఉన్నాడని నెట్టింట పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది.

ఆ త‌ర్వాత కాసేప‌టికి అత‌డు మేన‌ల్లుడు అని తేలే స‌రికి కాబోయే సూప‌ర్ స్టార్ అని అభిమానులు అంచ‌నాకి వ‌చ్చేసారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న చ‌రిత్ మాన‌స్ ఇన్ స్టా వీడియో చూస్తే స్టార్ ని ముందుగానే రెడీ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అవును చ‌రిత్ మాన‌స్ సాహ‌సోపేత‌మైన జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. మార్ష‌ల్ ఆర్స్ట్ లోనూ త‌ర్పీదు పొందుతున్నాడు. ఇవ‌న్నీ నేర్చుకోవ‌డానికి ఇదే స‌రైన వ‌య‌సు.

చిన్న వ‌య‌సులోనే కీళ్లు అన్ని స‌క్ర‌మంగా వంగుతాయి. నేర్చుకొవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. సెల్ప్ డిఫెన్స్ కి ఇలాంటి ట్రైనింగ్ ఎంతైనా అవ‌స‌రం. పైగా సెల‌బ్రిటీ కుటుంబం నుంచి వ‌స్తున్నాబు కాబ‌ట్టి మ్యాక‌ప్ వేసుకోవడానికి ముందే అన్ని ర‌కాలుగా త‌ర్పీదు పొంది ఉండాలి. చ‌రిత్ మాన‌స్ ప్యూచ‌ర్ స్టార్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మామ‌ని ఆద‌ర్శంగా తీసుకుని...తండ్రిని వార‌స‌త్వం తీసుకుని తెరంగేట్రం చేసేస్తాడు.

ఎదిగే కొద్ది చ‌రిత్ మాన‌స్ రూపం స‌హా ...శ‌రీరంలో చాలా మార్పులొస్తాయి. ఈ నేప‌థ్యంలో చిన్న నాటి నుంచి ఫిట్ నెస్ ప‌రంగా అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఇక తండ్రి సుధీర్ బాబు మంచి ఫిట్ నెస్ ప్రీక్. సిక్స్ ప్యాక్ బాడీ...అత‌డి శ‌రీర సౌష్టం ఎంత ప‌టిష్టంగా ఉంటుందో తెలిసిందే. బ్యాడ్మింట్ స్టార్ కావాల్సిన స్టార్ అనుకోకుండా న‌టుడ‌య్యాడు. మ‌రి ఒక‌వేళ చ‌రిత్ మాన‌స్ ని అటువైపుగా ట్యూన్ చేస్తున్నారా? అన్న‌ది ఓ డౌట్.