Begin typing your search above and press return to search.

ఆ విషయంలో నేను బ్యాడ్‌ : చరణ్‌

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిని మించి గుర్తింపు దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 1:30 AM GMT
ఆ విషయంలో నేను బ్యాడ్‌ : చరణ్‌
X

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిని మించి గుర్తింపు దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు. హీరోగా చరణ్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాల వైపు ఇండియన్ సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.

మరో బ్లాక్‌ బస్టర్ చరణ్ నుంచి వస్తుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు అంతా కూడా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ ను మొదలు పెట్టిన చరణ్‌ త్వరలో బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఒక వైపు నటుడిగా బిజీగా ఉంటూనే మరో వైపు నిర్మాతగా కూడా తన పనులు చూసుకుంటూ ఉన్న చరణ్ వ్యాపారాల విషయంలో మాత్రం ఆసక్తి చూపడం లేదు. గతంలో వ్యాపారంలో అడుగు పెట్టి నిరాశ పడ్డ చరణ్ తాను ఒక బ్యాడ్‌ బిజినెస్‌మెన్ అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

నా జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని నేను ఆలోచించి తీసుకుంటాను. నేను ప్రతి విషయంలో కూడా స్పష్టంగా ఉంటాను అన్నట్లుగా చరణ్‌ చెప్పుకొచ్చాడు. నిద్ర పట్టని రాత్రులు గడిపే వ్యాపారం చేయాలని ఉపాసన కూడా కోరుకోదు అన్నట్లుగా చరణ్ చెప్పుకొచ్చాడు.

రామ్‌ చరణ్, ఉపాసన దంపతుల యొక్క కూతురు క్లింకార రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. ఈ మెగా దంపతులు తమ కూతురు ఫేస్ ను ఇంకా రివీల్‌ చేయలేదు. అయినా కూడా సోషల్‌ మీడియాలో క్లింకార విషయాలు తెగ చర్చకు వస్తూనే ఉంటాయి.