Begin typing your search above and press return to search.

చరణ్.. అసలు ఇది నమ్మేలా ఉందా?

మరోవైపు, మొన్నే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 మూవీ పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి.

By:  Tupaki Desk   |   23 March 2024 2:30 AM GMT
చరణ్.. అసలు ఇది నమ్మేలా ఉందా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఓవైపు గేమ్ ఛేంజర్ మూవీలో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మూడేళ్ల క్రితం మొదలైనా ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు, మొన్నే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 మూవీ పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి.

ఇంకా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాకుండానే.. నిన్నంతా RC17 హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా.. సుకుమార్ తో తీయనున్నారని వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. ఇప్పటికే చరణ్ కు సుకుమార్ స్టోరీ చెప్పి లాక్ చేశారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన రంగస్థలం మూవీ.. అప్పట్లో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

ఇదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు సినీ వర్గాల్లో RC 18 సినిమా గురించి జోరుగా చర్చ సాగుతోంది. స్టార్ డైరెక్టర్లు పూరీ జగన్నాథ్ లేక కొరటాల శివతో చరణ్ 18వ సినిమా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. పూరి తో చేసిన చిరుత సినిమా తోనే చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక కొరటాల శివతో చేసిన ఆచార్య డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే అంతా ఓకే అయితే వచ్చే ఏడాది ఈ ఇద్దరిలో ఎవరితో ఒకరితో RC18 సినిమా పట్టాలెక్కనుందట.

దీంతో చరణ్ లైనప్ మామూలుగా లేదని అంటున్నారు నెటిజన్లు. వరుస చిత్రాలతో అలరించనున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం RC 18 రూమర్ డైరెక్టర్లు పూరీ జగన్నాథ్, కొరటాల శివ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇంకోవైపు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మార్చి 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడి జూన్ లో విడుదల అవ్వనుంది. డబుల్ ఇస్మార్ట్ మూవీపై రామ్, పూరి మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఇద్దరికీ గట్టి హిట్ కీలకం కూడా. అయితే పూరి, కొరటాల తమ లేటెస్ట్ మూవీలతో హిట్ కొడితే.. చరణ్ తో ఛాన్స్ పక్కా అని చెప్పవచ్చు. మరేం జరుగుతుందో చూడాలి.