Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్-ఉపాస‌న‌ల‌కు రామ‌మందిర్ ఆహ్వానం

అయోధ్య‌లో రామ‌మందిర్ ప్రారంభోత్స‌వం అంగ‌రంగ వైభంగా ఈనెల 22న భారీ ఎత్తున జ‌రుగు తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Jan 2024 9:32 AM GMT
చ‌ర‌ణ్-ఉపాస‌న‌ల‌కు రామ‌మందిర్ ఆహ్వానం
X

అయోధ్య‌లో రామ‌మందిర్ ప్రారంభోత్స‌వం అంగ‌రంగ వైభంగా ఈనెల 22న భారీ ఎత్తున జ‌రుగు తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంది. ప్రారంభోత్స‌వ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ ప్రారంభోత్స కార్య‌క్ర‌మానాకి టాలీవుడ్..కోలీవుడ్...శాండిల్ వుడ్..మాలీవుడ్ బాలీవుడ్ వ‌ర‌కూ చాలా మంది సెల‌బ్రిటీల‌కు ఆహ్వానం అందిన సంగ‌తి తెలిసిందే.

అన్ని ప‌రిశ్ర‌మ‌ల అగ్ర న‌టుల‌కు ప్ర‌భుత్వం త‌రుపున ఆహ్వానం వెళ్లింది. తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి మెగా స్టార్ చిరంజీవికి..డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌త్యేక ఆహ్వానం అందింది. తాజాగా రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌కు కూడా ఆహ్వానం అందింది. రామమందిర ట్ర‌స్ట్ ప్ర‌తినిధులు ఈ జోడీని ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో వారంతా త‌ప్ప‌క హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అయితే వీరంద‌రికి ఒకేసారి ఆహ్వానం అందిన‌ట్లు లేదు.

తొలుత చిరంజీవికి...ప్ర‌భాస్ కి మాత్ర‌మే ఆహ్వాన ప‌త్రిక పంపించిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌ల‌కు కూడా ఆహ్వానం అందండంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. సీతా-రాముల వారి స‌న్నిధికి మా రామ‌-సీత‌లు కూడా హాజ‌ర‌వుతున్నార‌ని అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. మ‌రి వీరంతా త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతారా? లేదా? అన్న‌ది చూడాలి.

ఇక కోలీవుడ్ నుంచి ర‌జ‌నీకాం త్..ధ‌నుష్‌..మాలీవుడ్ నుంచి మోహ‌న్ లాల్ కు..క‌న్న‌డ నుంచి య‌శ్.. `కాంతార` న‌టుడు రిష‌బ్ శెట్టికి ఆహ్వానాలు అందాయి. బాలీవుడ్ నుంచి అమితా బ‌చ్చ‌న్..అక్ష‌య్ కుమార్..అజ‌య్ దేవ‌గ‌ణ్..ర‌ణ‌బీర్ క‌పూర్..టైగ‌ర్ ష్రాప్ ..మాధురీ దిక్షిత్..అనుప‌మ్ ఖేర్.. రాజ్ కుమార్ హిరాణీ..సంజ‌య్ లీలా భ‌న్సాలీ.. రోహిత్ శెట్టిల‌కు ఆహ్వానాలు అందాయి.