Begin typing your search above and press return to search.

చరణ్ బుచ్చి బాబు.. క్రేజీ అప్డేట్..!

బుచ్చి బాబు ఈ సినిమాను కూడా కోనసీమ నేపథ్యంతోనే ప్లాన్ చేస్తున్నారట.

By:  Tupaki Desk   |   22 July 2023 6:27 AM GMT
చరణ్ బుచ్చి బాబు.. క్రేజీ అప్డేట్..!
X

RRR తర్వాత చరణ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సెట్స్ మీద ఉండగా త్వరలోనే బుచ్చి బాబు సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆర్సీ 16వ సినిమాగా బుచ్చి బాబు డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది. ఉప్పెన తో మొదటి సినిమాతోనే తన సత్తా చాటిన బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నాడు.

చరణ్ సినిమా కోసం బుచ్చి బాబు కూడా ఓ రేంజ్ ప్లానింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది. బుచ్చి బాబు ఈ సినిమాను కూడా కోనసీమ నేపథ్యంతోనే ప్లాన్ చేస్తున్నారట.

బుచ్చి బాబు ఇప్పటికే కథ సిద్ధం చేయగా చిన్న చిన్న మార్పులు తప్ప స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఆర్సీ 16తో బుచ్చి బాబు పాన్ ఇండియా అటెంప్ట్ కి సిద్ధమవుతున్నాడు.

చరణ్ గేమ్ చేంజర్ కూడా నేషనల్ వైడ్ రిలీజ్ అవుతుండగా ఆ తర్వాత వస్తున్న బుచ్చి బాబు సినిమా కూడా పాన్ ఇండియా ప్లానింగ్ లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ ఉప్పెనతో ఫస్ట్ మూవీనే అదరగొట్టిన బుచ్చి బాబు తన సెకండ్ మూవీని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

RRR తర్వాత చరణ్ గేమ్ చేంజర్ మరోసారి బాక్సాఫీస్ పై సత్తా చాటనున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టాలని చూస్తున్నాడు. మిగతా పాన్ ఇండియా హీరోలతో పాటుగా చరణ్ తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యారు. బుచ్చి బాబు చరణ్ సినిమాకు సుకుమార్ హ్యాండ్ ఉంటుందా.. కోనసీమ నేపథ్యం తో చేస్తున్న సినిమా పాన్ ఇండియా ఫ్యాన్స్ ని మెప్పిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.