పేర్లు మర్చిపోయే చరణ్.. ఆ ఐడియా ఎవరిదంటే: ప్రదీప్
లేటెస్ట్ గా యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ప్రమోషన్‌లో రామ్ చరణ్ పేర్లు మర్చిపోతాడన్న కామెడీ కాన్సెప్ట్ ఓ ప్రమోషనల్ వీడియోలో చూపించారు.
By: Tupaki Desk | 10 April 2025 3:52 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంటారు. ఆయన నటన, స్టైల్, మాస్ అటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చరణ్‌కు ఓ ఫన్నీ క్వాలిటీ ఉంది. అదేంటంటే ఆయన కొన్నిసార్లు సహజంగానే కొన్ని పేర్లు మర్చిపోతుంటారు. ఈ విషయం ఓ సందర్భంలో తారక్ స్వయంగా చెప్పడం జరిగింది. ‘RRR’ ప్రమోషన్స్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సరదాగా చరణ్ తరచుగా పేర్లు మర్చిపోతాడని క్లారిటీగా చెప్పారు. దర్శకుడు రాజమౌళి కూడా పలుమార్లు ఆ విషయాన్ని చెప్పారు. అయితే ఈ విషయాన్ని చరణ్ సరదాగా తీసుకుంటారు.
ఇప్పుడు ఇదే అంశంపై ఓ వీడియో హైలెట్ అయ్యింది. లేటెస్ట్ గా యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ప్రమోషన్‌లో రామ్ చరణ్ పేర్లు మర్చిపోతాడన్న కామెడీ కాన్సెప్ట్ ఓ ప్రమోషనల్ వీడియోలో చూపించారు. ఈ కాన్సెప్ట్ ఐడియా దర్శకుడు సందీప్ దే అని అన్నారు. ఇక ఇందులో ప్రదీప్‌తో పాటు కమెడియన్ సత్య కలిసి మొదటి టికెట్‌ను చెర్రీ చేతుల మీదుగా అందించాలనే ప్రయత్నంలో ఉన్నారు.
అయితే ఈ సందర్భంగా చరణ్ సత్యను గుర్తుపట్టకుండా ‘కిషోర్’ అని పిలవడం ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచేసింది. చరణ్ ఫన్నీ టైమింగ్, సత్య ముఖంలో కనపడిన షాక్ మిక్స్‌డ్ ఎక్స్‌ప్రెషన్స్ ఆ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. ఈ వీడియోకు వచ్చిన స్పందన నేపథ్యంలో మేకర్స్ ప్రెస్‌మీట్‌లో దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. ఈ ఫన్నీ స్కిట్ తాలూకు ఐడియా గురించి మాట్లాడుతూ, "రామ్ చరణ్ గారు ముందుగానే సరదాగా ఏదైనా చేయమని చెప్పారు. దాంతోనే మేము 'పేరు మర్చిపోవడం' అనే ఐడియాను స్కిట్ కా మారుస్తే ఎలా ఉంటుందనుకుంటూ స్క్రిప్ట్ రెడీ చేసాం. ఇందులో ‘కిషోర్’ అని పిలవాలన్న ఐడియా మాత్రం రామ్ చరణ్ గారిదే. ఆయనే అలా చెబితే బాగా నవ్విపడ్డాం" అని యాంకర్ ప్రదీప్ తెలిపారు.
అంతే కాకుండా, ఈ స్కిట్‌ను సరదాగా తీసుకుని, పూర్తి కాస్ట్ అండ్ క్రూను మెచ్చుకున్నట్లు చెప్పారు. రామ్ చరణ్ ఈ సందర్భంగా సినిమా గురించి కూడా మాట్లాడారట. “చరణ్ గారు ఈ సినిమాని కచ్చితంగా చూస్తానని చెప్పారు. రిలీజ్‌కు ముందే షో ఉంటే చెప్తే వచ్చేస్తానని చెప్పారు. అంతటా ఫ్రెండ్లీగా, ఎలాంటి గ్యాప్ లేకుండా ఆయన మమ్మల్ని ట్రీట్ చేశారు. ఆయన నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం మాకెంతో స్పెషల్.” అని ప్రదీప్ వివరించారు. రామ్ చరణ్ ఈ జూనియర్ హీరోకు ఇస్తున్న ప్రోత్సాహం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
ఇక ఇప్పటికే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాకి మహేష్ బాబు ఫస్ట్ సాంగ్‌ను లాంచ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ సపోర్ట్ కూడా అదనంగా బూస్ట్ ఇవ్వడం వైరల్ గా మారింది. సో, ఇద్దరు పెద్ద స్టార్ హీరోల మద్దతుతో ప్రదీప్ సినిమా పబ్లిసిటీ ఊహించని రేంజ్‌లో పెరిగింది. కామెడీ, ఎమోషన్ మిక్స్‌తో రూపొందిన ఈ సినిమా ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. మరి రామ్ చరణ్ ఫన్నీ స్కిట్ ఎంతవరకు కలిసొస్తుంది, బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.
