Begin typing your search above and press return to search.

అందరూ కొత్తవాళ్ళైన రవితేజ ఛాన్స్ ఇచ్చారు - సతీష్ వర్మ

ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు సతీష్ వర్మ మాట్లాడుతూ సినిమా తీయడం ఒక ఎత్తయితే రిలీజ్ చేయడం అతి పెద్ద టాస్క్

By:  Tupaki Desk   |   11 Sep 2023 3:58 AM GMT
అందరూ కొత్తవాళ్ళైన రవితేజ ఛాన్స్ ఇచ్చారు - సతీష్ వర్మ
X

ఛాంగురే బంగారు రాజా సినిమాతో సతీష్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తిక్ రత్నం హీరోగా, సత్య, రవిబాబు లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ వారితో కలిసి నిర్మించారు. ఆధ్యంతం వినోదభరితంగా క్రైమ్, కామెడీ జోనర్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.

ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు సతీష్ వర్మ మాట్లాడుతూ సినిమా తీయడం ఒక ఎత్తయితే రిలీజ్ చేయడం అతి పెద్ద టాస్క్. అదృష్టం కొద్ది మాకు సెప్టెంబర్ 15 సెట్ అయ్యింది. తక్కువ టైం ఉన్న మాకు సాధ్యమైన స్థాయిలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కచ్చితంగా ఈ మూవీ ఆధ్యంతం మీ అందరిని నవ్విస్తుంది. మౌత్ టాక్ తో జనాల్లోకి వెళ్లే సినిమా అవుతుందని చెప్పుకొచ్చాడు.

అనంతరం రవితేజ గురించి మాట్లాడుతూ, ఈ సినిమాకి వర్క్ చేసే మా టీమ్ లో టెక్నీషియన్స్ అందరూ కొత్తవాళ్లే. మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ తో సహా అందరూ కొత్త టీమ్. అయిన కానీ రవితేజ మమ్మల్ని, కంటెంట్ ని బలంగా నమ్మారు. మాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. కచ్చితంగా రవితేజ ఇమేజ్ చెడిపోకుండా మా వరకు సినిమా బాగా చేసాం. ఇక రిజల్ట్ అనేది ఆడియన్స్ లోనే ఉందని అన్నారు.

అలాగే సహ నిర్మాతలుగా ఉన్న శ్వేతా, శాలిని కూడా ఎలాంటి టెన్షన్ ఉన్న మా వరకు తీసుకురాకుండా మూవీ అవుట్ ఫుట్ బాగా రావడానికి సహకరించారు. తక్కువ టైంలో పిలిచిన కూడా మమ్మల్ని ప్రోత్సహించడానికి దర్శకుడు హరీష్ శంకర్, శ్రీవిష్ణు, అనుదీప్, వెంకటేష్ మహా, ఎస్.కె.ఎన్, శరత్ మరార్, వివేక్ కూచిభట్లకి పేరు పేరు సతీష్ వర్మ థాంక్స్ చెప్పాడు.

లోబడ్జెట్ తో మాస్ మహారాజ్ రవితేజ బ్యానర్ నుంచి మట్టికుస్తీ మూవీతర్వాత రెండో సినిమాగా వస్తోన్న ఛాంగురే బంగారు రాజా మూవీ ఏ మేరకు ప్రేక్షకులని మెప్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వేళ హిట్ అయితే మాత్రం సతీష్ వర్మకి వెంటనే మరో సినిమా ఛాన్స్ దొరికే అవకాశం ఉందని చెప్పొచ్చు.