Begin typing your search above and press return to search.

ఛాంగురే బంగారు రాజా ట్రైలర్.. ఎలా ఉందంటే..

ఈ ఏడాదిలో చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద హిట్ అయిన మూవీస్ కొన్ని ఉన్నాయి. బలగం, బేబీ ఆ కోవలోకే వస్తాయి

By:  Tupaki Desk   |   11 Sep 2023 3:53 AM GMT
ఛాంగురే బంగారు రాజా ట్రైలర్.. ఎలా ఉందంటే..
X

ఈ ఏడాదిలో చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద హిట్ అయిన మూవీస్ కొన్ని ఉన్నాయి. బలగం, బేబీ ఆ కోవలోకే వస్తాయి. అలాగే మేమ్ ఫేమస్ కూడా పర్వాలేదనిపించుకుంది. మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయిన సూపర్ సక్సెస్ అవుతుందని ప్రూవ్ అయ్యింది. ఆ కోవలోకే వస్తోంది చాంగురే బంగారు రాజా. కార్తిక్ రత్నం, సత్య, రవిబాబు లీడ్ రోల్ లో వస్తోన్న ఈ చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజ నిర్మించారు.

ఫ్రేమ్ బై ఫ్రేమ్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. సతీష్ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ట్రైలర్ లోకి వెళ్తే ఒక గ్రామంలో వజ్రాలు దొరకడంతో కథ ప్రారంభమైంది. వాటికి మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుందని అందరూ హడావిడి చేస్తూ ఉంటారు. మధ్యలో పోలీస్ కానిస్టేబుల్ తో హీరో కార్తిక్ రత్నంప్రేమాయణం ఉంటుంది. నిత్య శ్రీ సత్య లవ్ స్టోరీ, అలాగే రవిబాబు ఎస్తర్ లవ్ స్టోరీ సీక్వెన్స్ ని ఎలివేట్ చేశారు.

సడెన్ గా గ్రామంలో ఒక హత్య జరగడం. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ గా అజయ్ గ్రామంలోకి వస్తాడు. కార్తిక్ రత్నం, సత్య, రవిబాబు ఆ కేసులో ఇరుక్కోవడం. దాని నుంచి బయటపడటానికి హత్య ఎవరుచేశారనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మూవీ కథగా ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. ఆధ్యాంతం ఫన్ ని జెనరేట్ చేస్తూ సినిమాని నడిపించినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

కార్తీక్ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్ కామెడీ ప్లాట్ ని దర్శకుడు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ నిర్మాణంలో మూవీ వస్తుందంటే కచ్చితంగా కథలో విషయం ఉంటుందని అనుకోవచ్చు. సత్య, రవిబాబుతో కామెడీని పండించే ప్రయత్నం చేశారు. కచ్చితంగా ఈ మూవీ థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కూర్చోబెట్టే మూవీ అవుతుందని భావిస్తున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథలకి ఈ మధ్యకాలంలో ఆదరణ బాగుంటుంది. క్రైమ్ కామెడీ కూడా తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫార్మాట్. సెప్టెంబర్ 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులని మెప్పిస్తుందనేది చూడాలి.