Begin typing your search above and press return to search.

9000 ఎత్తు అడుగులో వ‌న్ టేక్ వార్

అక్క‌డ స‌ముద్ర మ‌ట్టానికి 9000 అడుగుల ఎత్తులో వ‌న్ టేక్ వార్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు

By:  Tupaki Desk   |   13 Oct 2023 7:28 AM GMT
9000 ఎత్తు అడుగులో వ‌న్ టేక్ వార్
X

యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ బాలీవుడ్ కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతుంది. ఆ మ‌ధ్య కొన్ని ప్రాజెక్ట్ ల‌నుంచి అవాంత‌రాలు ఎదురైన‌ప్ప‌టికీ ఇప్పుడ‌వ‌న్నీ సెట్ అయ్యాయి. కొత్త సినిమాల జోరు పెంచాడు. ప్ర‌స్తుతం స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో 'చందూ ఛాంపియ‌న్' అనే సినిమా చేస్తున్నాడు. క‌బీర్ ఖాన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌మ్ముక‌శ్మీర్ లో జ‌రుగుతోంది. ఇక్క‌డ కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అక్క‌డ స‌ముద్ర మ‌ట్టానికి 9000 అడుగుల ఎత్తులో వ‌న్ టేక్ వార్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. 1965 కాలం నాటి యుద్ద స‌న్నివేశాల్ని ఒకే షాట్ లో తీయ‌డానికి ఆరువ్యాలీలో భారీ ఆర్మీ క్యాంపు సెట్ వేసి చిత్రీక‌రించారు. ఈ స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ‌పై కార్తీక్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. '8 నిమిషాల నిడివి గ‌ల సింగిల్ షాట్ వార్ అనేది నా న‌ట‌నా జీవితంలోనే ఎంతో స‌వాల్ తో కూడుకున్న‌ది.

మునుపెన్న‌డు ఇలాంటి సాహ‌సోపేత‌మైన స‌న్నివేశాల్లో న‌టించ‌లేదు. అలాంటి అవ‌కాశం కూడా రాలేదు. వ‌చ్చిన ఈ గొప్ప అవ‌కాశాన్ని నిరూపించు కోవాల‌నుకున్నా. అందుకే చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. నాజీవితంలో మ‌ర్చిపోలేని క‌ష్టం ఇది. జీవితాంతం గుర్తుండే స‌న్నివేశం కూడా ఇదే. ఇలాంటి గొప్ప జ్ఞాప‌కాన్ని అందించినందుకు ద‌ర్శ‌కుడికి కృతజ్ఞ‌త‌లు' అని అన్నారు.

ఈ చిత్రాన్ని నదియావాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియద్వాలా నిర్మిస్తు న్నారు. భారతదేశం నుండి మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచిన ఫ్రీస్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 1965 ఇండో-పాక్‌ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగ వైకల్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్‌ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తి వంతమైన ప్రయాణాన్ని వెండి తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా 2024లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురా నున్నారు.