Begin typing your search above and press return to search.

చంద్రముఖి 2.. తెలుగు రైట్స్ ఎవరికంటే..

ట్రైలర్ చూసిన తర్వాత మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ ఈ సినిమాను తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 12:14 PM GMT
చంద్రముఖి 2.. తెలుగు రైట్స్ ఎవరికంటే..
X

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లారెన్స్ తెలియనివారు ఎవరూ ఉండరు. ఆయన కేవలం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా, నటుడిగాను తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పటికే, ఆయన హీరోగా చాలా సినిమాలు తీశారు. హిట్లు కూడా అందుకున్నారు. ఆయన ఇప్పుడు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చంద్రముఖి2. రజినీకాంత్ హీరోగా, దాదాపు 17ఏళ్ల క్రితం వచ్చిన సినిమా చంద్రముఖి సినిమాకి ఇది సీక్వెన్స్ కావడం విశేషం.

అప్పుడు, రజినీకాంత్ నటించిన పాత్రలో ఇప్పుడు లారెన్స్ నటిస్తున్నారు. అప్పుడు చంద్రముఖిగా జ్యోతిక భయపెట్టింది. ఇప్పుడు, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ భయపెట్టడానికి రెడీ అయ్యింది. నిజానికి ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ, మేకర్స్ మూవీ విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడు, ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆ తేదీన ప్రభాస్ సలార్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, అది వాయిదా పడటంతో, ఇప్పుడు ఆ సెప్టెంబర్ 28వ తేదీన లాక్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ మూవీలో పోస్టర్లు, ట్రైలర్లు విడుదల చేయగా, అవి విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ ఈ సినిమాను తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఈ సినిమాకి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్‌ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. .ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

చంద్రముఖి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి, దానికి కంటిన్యూటిగా వస్తున్న రెండో భాగం ఎంత మేర ఆకట్టుకుంటుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. గతంలో వెంకటేష్ దీనికి సీక్వెన్స్ గా నాగవల్లి అనే సినిమా తీశారు. కానీ, అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి, ఈ చంద్రముఖి 2 ఎంత భయపెడుతుందో చూడాలి.